చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్‌ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది.
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్‌జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌తో కలిసి రూమీ–1 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు.
రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్‌జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్‌ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌ను తయారు చేసినట్లు స్పేస్‌జోన్ కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment