టెక్నాలజీ పరంగా జపాన్ ఎంతో అభివృద్ది చెందింది. అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ అగ్రదేశాలకు పోటీనిస్తూ వస్తోంది ఈ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతులున్న జపాన్‌కు అంతరిక్ష ప్రయోగాల పరంగా మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్‌కు చెందిన అంతరిక్ష సంస్థ అభివృద్ది చేస్తున్న ఒక రాకెట్ ఇంజిన్ పరీక్ష సమయంలో పేలిపోయింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు.
రెండో దశ ఇంజిన్‌కు సంబంధించిన గ్రౌండ్ టెస్ట్ ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.50 నిమిషాలకుఎప్సిలాన్-6 రాకెట్ రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఉదయం 9.57 గంటలకు అధికారికంగా ప్రకటించింది.
అకిటా ప్రిఫెక్చర్‌లోని నోషిరో టెస్టింగ్ సెంటర్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ప్రకారం, పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రస్తుత ఎప్సిలాన్ సిరీస్‌కు వారసుడిగా ఎప్సిలాన్ S ను అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్‌ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి.
చదవండి గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా?
Comments
Please login to add a commentAdd a comment