Space Centre
-
పరీక్ష చేస్తుండగా.. పేలిపోయిన జపాన్ రాకెట్ ఇంజిన్
టెక్నాలజీ పరంగా జపాన్ ఎంతో అభివృద్ది చెందింది. అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ అగ్రదేశాలకు పోటీనిస్తూ వస్తోంది ఈ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతులున్న జపాన్‌కు అంతరిక్ష ప్రయోగాల పరంగా మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్‌కు చెందిన అంతరిక్ష సంస్థ అభివృద్ది చేస్తున్న ఒక రాకెట్ ఇంజిన్ పరీక్ష సమయంలో పేలిపోయింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండో దశ ఇంజిన్‌కు సంబంధించిన గ్రౌండ్ టెస్ట్ ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.50 నిమిషాలకుఎప్సిలాన్-6 రాకెట్ రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఉదయం 9.57 గంటలకు అధికారికంగా ప్రకటించింది. అకిటా ప్రిఫెక్చర్‌లోని నోషిరో టెస్టింగ్ సెంటర్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ప్రకారం, పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రస్తుత ఎప్సిలాన్ సిరీస్‌కు వారసుడిగా ఎప్సిలాన్ S ను అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్‌ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. చదవండి గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? -
Nasa: చంద్రుడిపైకి మళ్లీ.. ఈసారి ఏకంగా..!
వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలో భాగంగా నాసా శాస్త్రవేత్తలు మళ్లీ చంద్రునిపై కాలుపెట్టనున్నారు. ఈసారి.. చంద్రుడిపై ప్రయోగాల సందర్భంగా వ్యోమగాములు తరచూ వినియోగించుకునేందుకు వీలుగా చందమామ సమీప కక్ష్యలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఏ కక్ష్య అనువుగా ఉంటుందో విషయాన్ని నిర్ధారించేందుకు మంగళవారం క్యాప్‌స్టోన్ అనే ఒక బుల్లి ఉపగ్రహాన్ని పంపారు. ఒక మైక్రోవేవ్ పరిమాణముండే 25 కేజీల ఈ కృత్రిమ శాటిలైట్‌ను మోసుకెళ్లే రాకెట్‌ను న్యూజిలాండ్ నుంచి ప్రయోగించారు. క్యాప్‌స్టోన్ చందమామ సమీపానికి చేరుకుని దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఆ క్రమంలో చంద్రుడికి దగ్గరగా వచ్చినపుడు 2,200 మైళ్లదూరంలో, దూరం జరిగినపుడు 44 వేల మైళ్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి కక్ష్యలో పరిభ్రమించనున్న తొలి కృత్రిమ ఉపగ్రహంగా చరిత్ర సృష్టించనుంది. ఆర్నెల్ల పాటు శోధించి అక్కడి స్పేస్‌స్టేషన్ నిర్మాణ అనుకూల కక్ష్యల సమాచారాన్ని నాసాకు చేరవేస్తుంది. భవిష్యత్‌లో ఈ స్పేస్ స్టేషన్ నుంచే వ్యోమగాములు చందమామపై వేర్వేరు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. Liftoff! #CAPSTONE launched aboard a @RocketLab Electron rocket to pave the way for future @NASAArtemis missions to the Moon and beyond. What’s next for the microwave oven-sized satellite? Check out https://t.co/dMVnvEQcfC for updates. pic.twitter.com/VVoAOjSYbD — NASA (@NASA) June 28, 2022 -
Space Solar Plant: ఆకాశం నుంచి కరెంట్!
ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా.. చైనా ప్రాజెక్టు ఇదీ.. ►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది. ►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు. ►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు. ►ప్రస్తుతం చైనాలోని చోంగ్‌కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. ►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఖర్చు తక్కువే.. 2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్‌ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది. ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది. ఓ ఫిక్షన్ నవల నుంచి.. ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్‌ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. లాభాలు ఎన్నో? ►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది. ఆయుధంగా మారుతుందా? జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం. ►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్‌లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్‌ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. -
శిరీష సాహసం గర్వకారణం
సాక్షి, తెనాలి: ‘తాతా...డోంట్ ఫియర్...సక్సెస్‌ఫుల్‌గా తిరిగొస్తాను’ ..అని చెప్పిన మనుమరాలు అంతరిక్ష యానం పూర్తిచేసుకొని విజయవంతంగా తిరిగి రావటం ఎన లేని సంతోషాన్ని కలిగిస్తోందని రోదసీ యాత్ర చేసిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు సృష్టించిన బండ్ల శిరీష తాతయ్య రాపర్ల వెంకట నరసయ్య అన్నారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్టు నుంచి సాగిన అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని తోటి బంధువులతో కలిసి వీక్షించిన దగ్గర్నుంచీ, వెంకటనరసయ్య దంపతుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. మరుసటి రోజంతానూ బంధువులు, మిత్రులు, సన్నిహితుల అభినందనలు అందుకుంటూనే ఉన్నారు. సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ఈనెల ఆరో తేదీన మనుమరాలు శిరీష తనతో ఫోనులో మాట్లాడి, తమకు ధైర్యం చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లవరకు తన దగ్గర పెరిగిన శిరీష 1992లో అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిందన్నారు. తిరిగి తొమ్మిదేళ్ల వయసులో 1997లో తెనాలి వచ్చినపుడు పైలట్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు...‘నేను పైలెట్‌నై మిమ్మల్నిద్దర్నీ అమెరికా తీసుకెళతాను తాతయ్యా’ అని చెప్పిందన్నారు. కంటిచూపు కారణంగా అవకాశం మిస్సయినా, తగిన చదువులు చదివి, ప్రైవేటు రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుని ఈ స్థాయికి చేరుకుందన్నారు. 2016లో తమ 50వ వివాహ వార్షికోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిందనీ, మళ్లీ 2019లో వచ్చినపుడు తనకు కాబోయే భర్తను శిరీష పరిచయం చేసినట్టు వివరించారు. అంతరిక్ష యాత్ర ముగిశాక తన కుమార్తె, అల్లుడుతో మాట్లాడానని చెప్పారు. శిరీషతో మాట్లాడేందుకు వీలుపడలేదన్నారు. ఏదేమైనా స్త్రీలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరనీ తన మనుమరాలు సాహసయాత్రతో చాటటం గర్వకారణంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న తీరు, సాధించిన వైనం యువతకు స్ఫూర్తి కాగలదన్నారు. -
నాసా ఛాలెంజ్.. గెలిస్తే రూ.లక్షలు మీ సొంతం
వాషింగ్టన్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఓ విషయమై ఔత్సాహికులు లేదా వంటల విషయమై అనుభవజ్ఞులైన వారికి ఓ ఆఫర్ ప్రకటించింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం తిండి పదార్థాలు ఏం తీసుకెళ్లాలనే విషయం మీరు చెప్పాలి. అంతరిక్షంలో ఆ వాతావరణాన్ని తట్టుకుని పాడవకుండా నెలల పాటు నిల్వ ఉండే ఆహార పదార్థాలు చెబితే మీరు కొన్ని వేల డాలర్లు సొంతం చేసుకోవచ్చు. మార్స్ (అంగారకుడు)పైకి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు నాసా ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో వ్యోమగాములు అంగారక గ్రహంపై ఉండేందుకు వారికి కావాల్సిన ఆహార పదార్థాలను సిద్ధం చేయడానికి తంటాలు పడుతోంది. ఏ ఆహారం తీసుకెళ్లినా కొన్ని నెలలకు పాడవుతుంది. కానీ వ్యోమగాములకు మూడేళ్ల పాటు ఆహారం నిల్వ ఉండే పదార్థాలను తెలపాలని నాసా సలహాలు ఆహ్వానిస్తోంది. మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వ్యోమగాముకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెప్పిన వారికి 5 లక్షల డాలర్ల బహుమతి ప్రకటించింది. దీనికి ‘డీప్ స్పేస్ ఫుడ్’ చాలెంజ్ అనే పేరు పెట్టారు. స్పేస్ మిషన్లలో వ్యోమగాముల ఆహారానికి సంబంధించి కొత్త వ్యవస్థలు, టెక్నాలజీలను కనుగొనాలని నాసా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. అంగారకుడిపైకి వెళ్లిరావడం కలిపితే కనీసం మూడేళ్లు పడుతుంది. ఈ సుదీర్ఘ యాత్రలో వ్యోమగాములకు ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలి. అయితే వారికి అవసరమైన ఆహార పదార్థాలు పంపితే అక్కడి వాతావరణం తట్టుకుంటాయా లేదా నిల్వ ఉంటాయా అనే దానిపై మీమాంస ఏర్పడింది. వారికి కావాల్సినంత ఆహారాన్ని రాకెట్లో పంపే పరిస్థితి కూడా లేదు. దీంతో వారి ఆహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘అల్ట్రా హై కేలరీ చాక్లెట్ బార్లను’ కనుగొన్నారు. అయితే సుదీర్ఘ ప్రయాణానికి అది సరిపడా పంపించాలంటే బరువుతో కూడుకున్నది. అవి పంపిస్తే రాకెట్ బరువు పెరిగి ప్రయోగం వికటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త మార్గాల్లో వ్యోమగాములకు ఆహారం అందించడంపై పోటీ పెట్టారు. వినూత్న ఆలోచనలను తమతో పంచుకోవాలని నాసా పిలుపునిచ్చింది. కొత్త తరహాలో ఆలోచించేవాళ్లు మే 28వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చని నాసా సూచించింది. జూలై 30వ తేదీలోపు తన వినూత్న ప్రాజెక్ట్‌లను నాసాకు అందించాలి. టాప్ 20 బృందాలకు ఒక్కొక్కరికి 25 వేల డాలర్ల చొప్పున మొత్తం 5 లక్షల డాలర్లు అందిస్తామని నాసా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికావాసులకు మాత్రమే పరిమితం చేశారు. Landing on Mars is hard. Feeding astronauts nutritious, delicious food for months will be a challenge. 🌎🚀🇲🇭 The @NASAPrize and @csa_asc’s #DeepSpaceFoodChallenge 🏆💰 is here to be won by innovative teams designing food for the next frontier! 👉 https://t.co/zmckWeYk3M https://t.co/YKRSFNftaO — Deep Space Food Challenge (@DeepSpaceFood) February 12, 2021 -
అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్
ఇండోర్: భారత్‌కు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే సామర్థ్యముందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కిరణ్ తెలిపారు. అయితే ఇందుకోసం దీర్ఘకాల వ్యూహం, పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. ఇండోర్‌లో సోమవారం జరిగిన రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన కిరణ్ కుమార్.. ‘అంతరిక్ష కేంద్రం నిర్మించే సామర్థ్యం మనకుంది. దేశం నిర్ణయం తీసుకున్న రోజు మేం ప్రాజెక్టును స్వీకరిస్తాం. ఇందుకోసం విధి విధానాలను రూపొందించి కావాల్సిన నిధులు, సమయం ఇస్తే చాలు’ అని తెలిపారు. మానవరహిత అంతరిక్ష కేంద్రం వల్ల ఉపయోగమేంటనే అంశంపైనా ఇంకా చర్చిస్తున్నామని అందుకే ఈ దిశగా ఆలోచన చేయలేదన్నారు. వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్ నెట్వర్క్ రంగాల్లో విస్తృత పరిశోధనలకోసం మరిన్ని ఉపగ్రహాలను పంపించాల్సిన అవసరం ఉందన్నారు. -
కౌంట్‌డౌన్ షురూ