సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే 24వ తేదీన జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా నావిక్–01 (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1జే) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీనిని నిర్వహించేందుకు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్‌ను అనుసంధానం చేసే పనులు ప్రారంభించారు.
షార్‌లో లాంచింగ్ వసతులు పెరిగిన తర్వాత నెలకు ఒక ప్రయోగం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ సీ55ని ప్రయోగించారు. ఆ ప్రయోగం పూర్తయిన వెంటనే మే 24న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్12 ద్వారా నావిక్–01 ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)ను బలోపేతం చేయడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment