క్రికెట్ బెట్టింగ్‌ బుకీల అరెస్ట్: 18 లక్షలు స్వాధీనం | police nabs cricket betting rocket | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్‌ బుకీల అరెస్ట్: 18 లక్షలు స్వాధీనం

Published Wed, Jun 22 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

నగరంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీకాకుళం: నగరంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళంలోని పుప్పాలవారి వీధిలో నివాసం ఉంటున్న టంకాల వెంకటరమణ అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంగ్లాండ్-శ్రీలంక జట్ల మధ్య రసవత్తర పోటీకి బెట్టింగ్ ను నిర్వహిస్తుండగా దాడి చేసి పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బుకీ టంకాల వెంకటరమణతో పాటు మరో 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం 22 లక్షలు విలువజేసే నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెట్టింగ్ రాకెట్ సంబంధించి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న కిరణ్, అతని తమ్ముడు రవి ప్రస్తుతం విశాఖపట్టణంలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement