టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది.
JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.”
— Collin Rugg (@CollinRugg) March 13, 2024
The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters)
The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy
ఈ రాకెట్‌ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్‌మార్కెట్‌లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment