వీడియో: మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం విఫలం.. పేలిపోయిన రాకెట్‌ | Elon Musk SpaceX Starship Explodes After Launch, Debris Seen Falling From Space, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం విఫలం.. పేలిపోయిన రాకెట్‌

Published Fri, Jan 17 2025 7:08 AM | Last Updated on Fri, Jan 17 2025 11:05 AM

SpaceX Starship Explodes After Launch Falling From Space

వాషింగ్టన్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌(Elon Musk)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ విఫలమైంది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే సాంకేతిక లోపాలతో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌(SpaceX) సంస్థకు బిగ్‌ షాక్‌ తగిలింది. టెక్సాస్‌లోని బొకా చికాలో నుంచి స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌(StarShip) విఫలమైంది. రాకెట్‌ భూ వాతావరణంలోకి చేరుకోగానే సాంకేతిక లోపం కారణంగా గాల్లోనే పేలిపోయింది. అనంతరం, రాకెట్‌కు సంబంధించిన శకలాలు.. కరేబియన్‌ సముద్రంలో పడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలను చిమ్ముతూ శకలాలు పేలిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, జనవరి 16న స్పేస్‌ఎక్స్ ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ కార్యక్రమం కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఏడో టెస్ట్ ఫ్లైట్ కరేబియన్ మీదుగా వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు రాకెట్‌ పేలిపోయింది. ఇక, రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంతో స్పేస్‌ఎక్స్‌ ‍స్పందించింది. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా.. రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం​ అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. ఈ మిషన్ అద్భుతమైన సాంకేతిక పురోగతిని ప్రదర్శించింది. వీటిలో 33 రాప్టర్ ఇంజిన్‌లతో కూడిన 232 అడుగుల పొడవైన రాకెట్ సూపర్ హెవీ బూస్టర్ యొక్క విజయవంతమైన మిడ్-ఎయిర్ ల్యాండింగ్ కూడా ఉండం విశేషం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement