Mystery Object On Australian Beach, From Chandrayaan 3 Launch? News Viral - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా బీచ్‌లో కలకలం.. ఈ మిస్టరీ వస్తువు చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించిందేనా?

Published Mon, Jul 17 2023 9:30 PM | Last Updated on Tue, Jul 18 2023 2:27 PM

Mystery Object On Australian Beach, From Chandrayaan 3 Launch? - Sakshi

ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు దర్శనమిస్తోంది.  అకస్మాత్తుగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఆ శకలాలు చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్‌ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు. కాగా దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్‌ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిస్తోంది.

ఆ వస్తువు ఏమయ్యి ఉండొచ్చని ఆ ప్రాంత అధికారులు విచారణను ప్రారంభించారు. ఇదిలా ఉండగా భారత్‌ చంద్రయాన్‌-3ను ఎల్వీఎం రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడం గమనార్హం. దీంతో ఇది చంద్రయాన్‌కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలతో ట్విటర్‌లో కామెంట్లతో నిండిపోతోంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. భారతీయ అంతరిక్ష సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు మౌనంగా ఉంది.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలిపింది. "మేము ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణలు చేస్తున్నాము. ఆ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుండి వచ్చి ఉండవచ్చుని భావిస్తున్నాం. మేము మరింత సమాచారాన్ని అందించగల వారితో సంభాషిస్తున్నాం" అని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement