అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై రాకెట్లతో దాడి | Roickets fired at Afghan parliament | Sakshi
Sakshi News home page

అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై రాకెట్లతో దాడి

Published Mon, Mar 28 2016 12:40 PM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై రాకెట్లతో దాడి - Sakshi

అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై రాకెట్లతో దాడి

కాబూల్: భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇందులో ఒకటి పార్లమెంటు ఆవరణలో పడగా మరో రెండు కాస్తంత దూరంలో పేలాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ బాంబు పేలుళ్ల సమయంలో దిగువ సభకు చెందిన సభ్యులు, వోలెసి జిర్గా సభ్యులు పార్లమెంటులో లోపల ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. ముఖ్యమైన అధికారులు లోపలికి వెళుతున్న సమయంలోనే ఈ రాకెట్లను ప్రయోగించినట్లు చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటి దాడులు గతంలో తాలిబన్లు చేశారు. ఈ భవనాన్ని భారత్ కట్టించి ఇవ్వగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో కూడా మోదీ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement