వాడిన రాకెట్‌ను మళ్లీ వాడారు | Used racket used again | Sakshi
Sakshi News home page

వాడిన రాకెట్‌ను మళ్లీ వాడారు

Published Sat, Apr 1 2017 2:50 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

వాడిన రాకెట్‌ను మళ్లీ వాడారు

వాడిన రాకెట్‌ను మళ్లీ వాడారు

కేప్‌ కానావెరల్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌ (స్పేస్‌ ఎక్స్‌) మొట్టమొదటి సారిగా పునర్వినియోగ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఫాల్కన్‌ 9 అనే రాకెట్‌ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి గురువారం సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. మొదటిసారి ఈ రాకెట్‌ను ఏడాది క్రితం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సముద్రం సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

మళ్లీ అదే రాకెట్‌కు తొమ్మిది ఇంజన్లను ఏర్పాటు చేయడంతోపాటు స్పేస్‌ ఎక్స్‌ దీన్ని ఆధునికీకరించింది. లక్సెంబర్గ్‌లోని ఎస్‌ఈఎస్‌ కంపెనీకి చెందిన ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌లో అంతరిక్షంలోకి స్పేస్‌ ఎక్స్‌ పంపించింది. తిరిగి ఈ రాకెట్‌ను విజయవంతంగా సముద్రంపై ల్యాండ్‌ చేయాలన్న లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఉన్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతంగా జరిపిన ఈ ప్రయోగం గొప్ప ముందడుగు అని స్పేస్‌ ఎక్స్‌ ముఖ్య సాంకేతిక అధికారి మార్టిన్‌ హాల్లివెల్‌ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement