చైనాలోని హైనన్ ద్వీపం నుంచి ఏప్రిల్ 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భారీ శకలం ఒకటి భూమిని ఢీకొట్టనుందా?. చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధనశాల భాగాలు పంపేందుకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. తిరిగి భూమిపైకి వచ్చే సమయంలో ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలం పూర్తిగా బూడిద అయిపోతుందని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ అని ఎక్కువమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలం తుర్కిమెనిస్తాన్ లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతుందని అంటోంది. ఇలా జనావాసాలపై ఈ రాకెట్ పడితే.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. చైనా మాత్రం వాతావరణంలో వేడికి అది పూర్తిగా కరిగిపోతుందని.. ఒకవేళ పడినా చిన్న ముక్కలే మిగులుతాయని.. వీటి వల్ల పెద్దగా నష్టం కూడా జరగదు అని వాదిస్తోంది.
చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!)
Comments
Please login to add a commentAdd a comment