మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో | India To Launch Cartosat 3 On 25th November | Sakshi
Sakshi News home page

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

Published Tue, Nov 19 2019 1:12 PM | Last Updated on Tue, Nov 19 2019 4:10 PM

India To Launch Cartosat 3 On 25th November - Sakshi

సాక్షి, బెంగళూరు : వరుస విజయాలతో దూసుకుపోతూ, అంతరిక్ష పరిశోధన రంగంలో భారత పతాక గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైనా.. నిరుత్సాహపడకుండా ఈ నెల 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ47 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. దీనిద్వారా కార్టోశాట్3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. హై రెజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇస్రో చెబుతున్నట్లు అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement