
సాక్షి, శ్రీహరి కోట : పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం అవ్వటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో, ఎన్‌ఎస్‌ఐఎల్‌కు అభినందనలు తెలియజేశారు. అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకం ప్రారంభమైందని, 19 ఉపగ్రహాల ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
ఇస్రో చీఫ్ శివన్ మాట్లాడుతూ.. బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో తొలి ప్రయోగం గర్వంగా ఉందన్నారు. 19 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు.
కాగా, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.19 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటిలో దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మొదటిసారి ప్రధాని మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, 25 వేల మంది పేర్లను పంపింది. వాటిలో వెయ్యి మంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నై విద్యార్ధుల పేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment