భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) పీఎస్‌ఎల్వీ–సీ42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాఎస్‌ఏఆర్, ఎస్1–4లను 230.4 టన్నుల బరువున్న పీఎస్‌ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)–సీ42 వాహక నౌక ఆదివారం రాత్రి సరిగ్గా 10.08 గంటలకు రోదసిలోకి మోసుకెళ్లింది.