ISRO Satellite
-
దానా కదలికలను ట్రాక్ చేసిన ఇస్రో ఉపగ్రహాలు
సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్ఎల్వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది.మేఘాలను బట్టి ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది.మోదీ అభినందనలుఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఉపగ్రహాలు దేశానికి చేస్తున్న సేవలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా కొనియాడారు. వాటిని తయారు చేస్తున్న మన శాస్త్రవేత్తలు విపత్తులను ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి.. దేశ ప్రగతిని కాపాడుతున్నారని ప్రధాని అభినందించారు. -
ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వివిధ రకాల వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఉపగ్రహ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో రికార్డులు నెలకొల్పుతోంది. అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గడచిన 4-5 ఏళ్ల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఇస్రో ఎలా డబ్బు సంపాదిస్తుందో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్ధ్యం, ప్యాషన్‌తో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల పురోగతి కుంటుపడిందన్నారు. మోదీ రాకతో ప్రైవేట్ మార్గాల నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి మాట్లాడారు. నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో సైతం దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతిని నొక్కిచెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. దాంతో డబ్బు సమకూరుతుందని తెలిపారు. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా సంపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అనేక దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ఏ వంటి దేశాలకు సర్వీసులు అందించిందని వివరించారు. యూరోపియన్ దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ చెప్పారు. ఇదీ చదవండి: అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా గగన్‌యాన్ మిషన్ 2025 ప్రారంభంలో మానవరూప రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని సింగ్ వెల్లడించారు. 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' గురించి సింగ్ మాట్లాడారు. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల గురించి వివరించారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? -
పీఎస్ఎల్వీ–సీ42 రాకెట్ ప్రయోగం సక్సెస్
-
చంద్ర కక్ష్యను దాటిన మంగళ్యాన్
చెన్నై: భూమి చుట్టూ నిర్ణీత పరిభ్రమణాలను పూర్తిచేసుకుని, అంగారకుడి వైపు దూసుకెళ్తున్న ‘మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్- మంగళ్యాన్)’.. చంద్రుడి కక్ష్య పరిధిని దాటింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ‘మామ్’ ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి, అంగారకుడి దిశగా పంపిన విషయం తెలిసిందే. రోజుకు పది లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ‘మంగళ్యాన్’.. దాదాపు 300 రోజుల అనంతరం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇప్పటివరకూ చంద్రయాన్ ఉపగ్రహం మాత్రమే అత్యంత దూరం వెళ్లింది. తాజాగా.. ‘మంగళ్యాన్’ భూమి పరిధిని దాటి ఎక్కువ దూరం ప్రయాణించిన తొలి ఉపగ్రహంగా నిలుస్తోంది.