
నింగినంటిన సంబరం
పీఎస్‌ఎల్‌వీ సీ 37 ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి.
సాక్షి అనంతపురం : పీఎస్‌ఎల్‌వీ సీ 37 ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మనదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని పలువురు ప్రశంసించారు. అనంతపురం, హిందూపురం, కదిరి, రాయదుర్గం, కణేకల్లు, తాడిపత్రి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు.