12న పీఎస్‌ఎల్వీ సీ41 ప్రయోగం | ISRO PSLV C41 Experiment on April 12 | Sakshi
Sakshi News home page

12న పీఎస్‌ఎల్వీ సీ41 ప్రయోగం

Published Sun, Apr 8 2018 3:07 AM | Last Updated on Sun, Apr 8 2018 3:07 AM

ISRO PSLV C41 Experiment on April 12 - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ – షార్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈ నెల 12న తెల్లవారు జామున 4.04 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ41 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు శనివారం ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌  సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది.

తొలుత నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ సిరీస్‌లో 7 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి పంపారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 43వ రాకెట్, ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లతో 20వ ప్రయోగం కావడం విశేషం. రాకెట్‌కు నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తిచేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఎంఆర్‌ఆర్‌ (మెషీన్‌ రెడీనెస్‌ రివ్యూ) సమావేశం నిర్వహించి, 10న కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement