పీఎస్‌ఎల్‌వీ సీ 35 విజయంలో సూర్యాపేట వాసి
పీఎస్‌ఎల్‌వీ సీ 35 విజయంలో సూర్యాపేట వాసి
Published Tue, Sep 27 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
సూర్యాపేట : పీఎస్‌ఎల్‌వీ సీ35 ప్రయోగం విజయవంతంలో సూర్యాపేట పట్టణానికి చెందిన శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ కీలక భాగస్వామ్యంతో సూర్యాపేట ప్రతిష్ట అంబరాన్నింటింది. సోమవారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ35 కోసం పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన చెరుకుపల్లి లింగయ్య – సరోజినిల పెద్ద కుమారుడు వెంకటరమణ సహకారం అందించారు. మారిషస్ భూ కేంద్రంలోని రాకెట్ ట్రాకింగ్ ద్వారా ముఖ్యమైన డేటాను శ్రీహరికోటకు అందించారు. గతంలో పీఎస్‌ఎల్వీ సి30 ప్రయోగ సమయంలో కూడా అతడు అల్కాటారా నుంచి టెలియాస్–1 ఉపగ్రహ సమాచారాన్ని అందించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్య
వెంకటరమణ సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల (నెం – 2)లో విద్యనభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఈస్ట్ మారెడుపల్లిలో ట్రిపుల్ ఈ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అనంతరం లక్నోలోని అంతరిక్ష కేంద్రంలో 15 సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నారు. కాగా వెంకటరమణను రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో జిల్లా వాసి భాగస్వామి కావడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు.
Advertisement