శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ–48కు మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉ.9.30 గంటలకు ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఉపగ్రహం లాంచ్ రిహార్సల్‌ను సోమవారం ఉ.6 గంటలకు విజయవంతంగా నిర్వహించారు