
10న పీఎస్‌ఎల్ వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10వ తేదీ రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ28 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల ఎనిమిదిన ఉదయం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో కెనడాకు చెందిన ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి రూ.1,440 కోట్ల ఆదాయం లభించనుంది.