పీఎస్‌ఎల్వీ సీ-47 ప్రయోగం ‌: శ్రీవారిని దర్శించుకున్న శివన్‌ | ISRO To launch PSLV-C47 on Wednesday | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్వీ సీ-47 ప్రయోగం ‌: శ్రీవారిని దర్శించుకున్న శివన్‌

Published Tue, Nov 26 2019 9:07 AM | Last Updated on Tue, Nov 26 2019 1:20 PM

ISRO To launch PSLV-C47 on Wednesday - Sakshi

సాక్షి, శ్రీహరి కోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. బుధవారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్‌ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-47ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్‌ నానో ఉపగ్రహాలు రోదసిలోకి పంపించనున్నారు. ఇందులో 12 ఫ్లోక్‌-4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉండనుంది. ఇది షార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement