పీఎస్‌ఎల్వీసీ-37 ప్రయోగం విజయవంతం అయినందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇస్రో విజయం నూతన శకానికి నాంది
Published Wed, Feb 15 2017 2:27 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
హైదరాబాద్: పీఎస్‌ఎల్వీసీ-37 ప్రయోగం విజయవంతం అయినందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో తొలిసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించిందని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో నూతన శకానికి ఈ ప్రయోగం నాంది అని చెప్పారు. భారత కీర్తి పతాకను రోదశిలో సగర్వంగా ఎగురవేయడం భారతావనికి గర్వకారణమన్నారు. ఇస్రో ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Advertisement
Advertisement