వేంపల్లె : విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం కానీ.. వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు మరిన్ని ప్రయోగాలు అవసరమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చెర్మైన్ విజయ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న అభియంత్ టెక్ ఫెస్టివల్-15 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన విద్యార్థులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం కానీ.. వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీయడంలో వైఫల్యం చెందుతున్నామన్నారు. ృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి సన్‌రైజ్ స్టేట్‌గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు.
ఆ టార్గెట్ రీచ్ కావాలంటే విద్యార్థులలో ృజనాత్మకత శక్తి పెరగాలన్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలో సన్‌రైజ్ విలేజ్ ప్రారంభమైందన్నారు. 2029 నాటికి 5వేల సన్‌రైజ్ విలేజ్‌లు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉందన్నారు. ఇది సాధ్యం కావాలంటే ఇలాంటి ఇంజనీరింగ్ విద్యార్థులే కీలకం అని చెప్పారు. బూత్ క్యాంపులు ఏర్పాటు చేసి వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీయాలని అధికారులకు సూచించారు. గ్లోబల్ స్థాయిలో జరిగే కాంపిటీషన్‌లో నెగ్గేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ట్రిపుల్ ఐటీలలో మిగతా కళాశాలలకు భిన్నంగా అధ్యాపకులకు బదులు మెంటార్స్ ఉండటం విశేషమన్నారు.
వీరివలన విద్యార్థులలో నైపుణ్యత శక్తి పెరుగుతోందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ టీం స్పిరిట్ ఎంతో బావుందన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంవల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులను సమీపంలోని పరిశ్రమలకు తీసుకెళ్లి.. అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తే బావుంటుందన్నారు. మైనింగ్ ఓపెన్ కాస్ట్‌పై పరిశోధనలు జరపడానికి క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థుల చేత చేయించాలన్నారు.
ప్రజలకు సాంకేతికత మరింత దగ్గర కావాలన్నారు. అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసుకొని ముందుకు వెళ్తే విజయం తథ్యం అన్నారు. గురువుకు బదులు గూగుల్ అనే పదం వినపడుతోందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కష్టపడి చదవడంతోపాటు ృజనాత్మకతను కలిగి భావి భారత శాస్త్రవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.