అద్భుత దృశ్యాలను వర్ణించడానికి...‘రెండు కళ్లు సరిపోవు’ అంటాం. అద్భుత దృశ్యాలను సృష్టించడానికి రెండు కళ్లతో పాటు మూడోకన్ను కూడా అవసరం.దాని పేరే... క్రియేటివ్ ఐబూమింగ్ మార్కెట్ యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెరగడం ఒక కోణం అయితే, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతరం క్రియేటివిటీకి విశాలమైన వేదిక దొరకడం అనేది మరో కోణం...
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల అభినవ్ భరద్వాజ్ ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన అభినవ్‌కు ఎన్నో పురాణ పాత్రలపై అవగాహన ఉంది. ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ట్, డిజైనింగ్‌ను కెరీర్‌గా చేసుకున్న అభినవ్ లాక్‌డౌన్ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్‌పై లెక్కలేనన్ని డిజైన్‌లను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సృష్టించాడు. వాటికి మంచి స్పందన రావడం ఒక ఎత్తయితే పాపులర్ బ్రాండ్‌ల నుంచి అవకాశాలు రావడం మరో ఎత్తు.
‘మనకు ఉన్న రెండు కళ్లతో పాటు క్రియేటివ్ ఐ అనే మూడో కన్ను కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే బ్రాండ్ డిజైనింగ్ నుంచి సినిమా వీఎఫ్‌ఎక్స్ వరకు రాణించగలం’ అంటాడు అభినవ్. కలర్స్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకు అతడి యూనిక్ స్టైల్ స్టేట్‌మెంట్‌కు యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో బెంగళూరుకు చెందిన శ్రీతేజస్వి ఒకరు. డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్న తేజస్వి వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తుంది. ఆ సాంకేతికత గురించి తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో రాస్తుంది. వినోద రంగంలో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీకి ఇది బంగారు కాలం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ స్టూడియోల సంఖ్య పెరుగుతోంది.
ముంబై, చెన్నై, బెంగళూరు... మొదలైన నగరాలు యానిమేషన్ కంపెనీలు, అకాడమీలకు కేంద్రాలుగా మారాయి. మన దేశానికి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ రంగంలో 2025 కల్లా 75,000 నుంచి 1,25,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. కమర్షియల్స్, వెబ్ సిరీస్, మూవీస్, వోటీటీకి హై–క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఈ నేపథ్యంలో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌లకు ప్రాధాన్యత పెరిగింది. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ బిజినెస్ కాంబినేషన్ యువతను ఆకర్షిస్తుంది. కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది.
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ యానిమేషన్‌కు డిమాండ్‌ను పెంచే కథలను సిద్ధం చేస్తోంది. ‘వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్‌లకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. అంచనాలకు అందని విధంగా ఈ రంగం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. వీఎఫ్‌ఎక్స్ అనేది సాంకేతికత మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. కథాసం విధానంలో భాగం’ అంటున్నాడు వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు రాజీవ్ కుమార్. స్కూల్ రోజుల నుంచే వీఎఫ్‌ఎక్స్ అంటే రాజీవ్‌కు ఆసక్తి. అయితే దాన్ని కెరీర్‌గా ఎలా చేసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు.
పుణెలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన రాజీవ్ ముంబైకి వెళ్లి వీఎఫ్‌ఎక్స్ ఇండస్ట్రీతో ప్రయాణం మొదలుపెట్టి భారీ విజయం సాధించాడు. మలయాళ చిత్రం కందిట్టుండు (అది చూడు) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. 25 సంవత్సరాల అదితి క్రిష్టదాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (ఎన్‌ఐడీ) లో యానిమేషన్ కోర్సు చేసిన అదితి క్రిష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకుంది.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంది చెన్నైకి చెందిన ప్రియాంక సుబ్రమణియన్. లండన్ ఫిల్మ్ స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా మూవింగ్ పిక్చర్ కంపెనీకి తరచు వెళ్లేది. ఇండస్ట్రీ ధోరణులను అర్థం చేసుకోవడం కోసం ఎందరో కళాకారులతో మాట్లాడేది. పుస్తకాలు చదివేది. స్టూడియోలలో అవసరమైన వారికి టీ, కాఫీలు, వోల్డ్ టేప్‌లు, హార్డ్ డిస్క్‌లు అందించేది. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ప్రియాంక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని కలలు కనేది. వీఎఫ్‌ఎక్స్ స్టూడియో రూపంలో తన కలను సాకారం చేసుకుంది.
మీ శక్తి వృథా చేయవద్దు
వీఎఫ్‌ఎక్స్ ప్రొడ్యూసర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి నిరుపయోగం కాకుండా చూసుకోవాలి.
– ప్రియాంక సుబ్రమణియన్
విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్
అ కథలు మళ్లీ ఇప్పుడు మనకు తరతరాల కథల సంపద ఉంది. అమ్మమ్మలు, నానమ్మల నోటి నుంచి కథలు వినే దృశ్యాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన ఎన్నో కథలను పిల్లలకు ఆకట్టుకునేలా చెప్పవచ్చు. యానిమేషన్ ఫిల్మ్స్ అంటే ఫన్నీ కార్టూన్స్‌ను మాత్రమే కాదు.
– అదితి క్రిష్ణదాస్, డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment