![Gaming: Tales Of KenJera' Will Release On 23rd Of This Month - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/12/Gaming.jpg.webp?itok=wCnlkAKr)
సర్జెంట్ స్టూడియోస్ వారి 'టేల్స్ ఆఫ్ కెన్‌జెర' గేమ్
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్‌జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్‌లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు.
శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్‌జెర’ అనేది 2.5డీ ప్లాట్‌ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్‌ను సొంతం చేసుకుంటారు.
- ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్‌టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్
- మోడ్: సింగిల్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment