Gaming Animation media
-
త్వరలో రెండు కొత్త గేమ్‌ల ఆవిష్కరణ
భారతదేశ గేమింగ్ పరిశ్రమలో రిడైమెన్షన్ గేమ్స్, షురా గేమ్స్ అనే కొత్త ఆన్లైన్ గేమ్‌లను త్వరలో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొరియన్ గేమింగ్ పబ్లికేషన్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. గేమింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కేఐజీఐ (క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్) ప్రోగ్రామ్ కింద ఈ ఆవిష్కరణలు చేపట్టినట్లు క్రాఫ్టన్ పేర్కొంది.‘నివేదికల ప్రకారం భారతదేశ గేమింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2022 సంవత్సరం చివరి నాటికి దేశంలో 50.7 కోట్ల మంది ఆన్లైన్ ఆటలపై ఆసక్తిగా ఉన్నారు. 2023లో వీరి సంఖ్య 12 శాతం పెరిగి 56.8 కోట్లకు చేరింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత గేమింగ్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, విలువలకు పెద్దపీట వేస్తూ గేమ్‌లను తయారు చేయాలన్నారు. దాంతో ఈ రంగంలో అపార అవకాశాలున్నాయని గుర్తించాం. ఈ పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారికి నిర్మాణాత్మక మెంటార్షిప్ అవసరం ఉంది. దాంతో 2023లో క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్-కేఐజీఐని ప్రారంభించాం. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన కంపెనీలకు గేమింగ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లను, క్రాఫ్టన్ గ్లోబల్ స్టూడియోస్ ద్వారా మెంటార్షిప్ను అందిస్తున్నాం. దాంతోపాటు కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి డేటా అనలిటిక్స్‌తోపాటు వాటి అవసరాలను బట్టి రూ.41 లక్షలు-రూ.1.2 కోట్లు వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!‘కంపెనీ అందిస్తున్న వసతులను, మెంటార్షిప్ను ఉపయోగించుకుని ఇటీవల రిడైమెన్షన్ గేమ్స్, షురా గేమ్స్ అనే రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2018లో నాగాలాండ్‌లోని కోహిమాలో ముగ్గురు సభ్యులతో రిడైమెన్షన్ గేమ్స్ ప్రారంభమైంది. ఈ కంపెనీ 2024లోనే సోజర్న్ పాస్ట్ పేరుతో యానిమేషన్ గేమ్‌ను విడుదల చేయనుంది. బెంగళూరుకు చెందిన షురా గేమ్స్ అనే కంపెనీ స్పైస్ సీక్రెట్స్ పేరుతో ఫజిల్గేమ్ను పరిచయం చేయనుంది. దీన్ని అన్ని వయసుల వారు ఆడేలా రూపొందించారు’ అని క్రాఫ్టన్ పేర్కొంది. -
గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్‌ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్‌ను రూపొందించారు.గేమ్ ల్యాండ్‌స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్‌ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్‌లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్‌ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత! -
Gaming: యుద్ధంలో ఒకరోజు...
ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్ అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్‌ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ గేమ్ మెన్ ఆఫ్ వార్–2. 2011లో వచ్చిన మెన్ ఆఫ్ వార్: అసల్ట్ స్వా్కడ్ సీక్వేల్‌గా వస్తున్న ఈ గేమ్ వరల్డ్ వార్–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన ‘మెన్ ఆఫ్ వార్’కు ఇది మోడ్రన్ రీమాస్టర్. లార్జ్ స్కేల్ టాంక్ కంబాట్ చేసే ప్లేయర్స్ కోసం స్కీమిష్ మోడ్ ఉంది.ఇంజిన్: జెమ్ 2ప్లాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్జానర్స్: రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
స్టెల్లర్ బ్లేడ్..! గ్రహాంతరవాసులతో వార్..!!
యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ‘స్టెల్లర్ బ్లేడ్’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది. కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్‌తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు. జానర్స్: యాక్షన్, అడ్వెంచర్.. ఇంజిన్: అన్రియల్ ఇంజిన్4 మోడ్స్: సింగిల్–ప్లేయర్ ప్లాట్‌ఫామ్: ప్లేస్టేషన్ 5 ఇవి చదవండి: ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా? -
Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్‌లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు. శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ అనేది 2.5డీ ప్లాట్‌ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్‌ను సొంతం చేసుకుంటారు. ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ మోడ్: సింగిల్ ప్లేయర్ -
Gaming: యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్.. 'హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్'
హరైజన్ జీరో డాన్ (2017) గేమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్ హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్(పీసీ) విడుదలైంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్లో ఆడే గేమ్ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్’ అనే హంటర్‌ను ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్ హంటర్ అలోయ్ శాస్త్రవేత్త ఎలిజబెత్ సోటెక్ క్లోన్. ‘మిస్టీరియస్ ప్లేగ్’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్బిడెన్ వెస్ట్ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్‌తో ΄ోల్చితే ఈ గేమ్ మ్యాప్ పెద్దగా ఉంటుంది. షీల్డ్వింగ్, ఫోకస్ స్కానర్, డైవింగ్ మాస్క్, పుల్కాస్టర్లాంటి టూల్స్‌ను కంబాట్‌లో ఉపయోగించవచ్చు. ప్లాట్‌ఫామ్స్: ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5 విండోస్ జానర్: యాక్షన్, అడ్వెంచర్ మోడ్: సింగిల్–ప్లేయర్ ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
ఎంటర్టైన్మెంట్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో గేమింగ్, మీడియా, వినోద రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన ‘ఇండియా జాయ్ 2019’ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఇంటర్నెట్ మాధ్యమంగా టీవీ, సినీ ప్రసారాలను అందించే ఓటీటీ (ఓవర్ ది టాప్) రంగం ఏటా 8 శాతం చొప్పున శరవేగంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం యానిమేషన్ విభాగంలో ఓటీటీ వాటా 2.9 బిలియన్ డాలర్లుగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా దక్షిణాసియాలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు కేంద్రంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని 150కి పైగావీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు, 2డీ, 3డీ యానిమేషన్, గేమింగ్ కంపెనీలు 30 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ల జనాభా ఉండగా, 2.3 బిలియన్ల మంది డిజిటల్ గేమింగ్‌లో చురుగ్గా ఉన్నారని, ప్రస్తుతం 140 బిలియన్ డాలర్లుగా ఉన్న గేమింగ్ మార్కెట్లో భారత్ వాటా 91 శాతం మేర అనగా 125 బిలయన్ డాలర్ల మేర ఉందని కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్ఫోన్లు, టాబ్లు జీవితంలో అంతర్భాగంగా మారిన నేపథ్యంలో 2020–25 నాటికి గేమిగ్‌రంగం 300 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో దేశంలో ప్రత్యేకించి తెలంగాణలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్, కంటెంట్ క్రియేషన్ రంగాల్లో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రంలో గేమింగ్ స్టార్టప్‌లు 25 ఉండగా, ప్రస్తుతం 250కి చేరాయని, ‘ఈ స్పోర్ట్స్’రంగంలో భారతీయ కంపెనీలకు అనేక అవకాశాలు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. 2022 నాటికి ఇమేజ్ టవర్స్ హైదరాబాద్‌లో ఏర్పాటైన గేమింగ్, వీఎఫ్ఎక్స్ సంస్థల ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, బాహుబలి, లైఫ్ ఆఫ్ పై వంటి అత్యున్నత సాంకేతిక సినిమాలు, చోటా బీమ్ వంటి యానిమేషన్ చిత్రాలకు ఇక్కడే రూపకల్పన జరిగిందని కేటీఆర్ చెప్పారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ కంపెనీల కోసం గ్రీన్‌మ్యాట్, మోషన్ క్యాప్చర్ వంటి అత్యాధునిక స్టూడియోలు.. పూర్తి సదుపాయాలతో కూడిన ఇమేజ్ టవర్స్ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఉపాధి దక్కేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. యానిమేషన్, గేమింగ్ తదితర రంగాలపై అవగాహన కల్పించేందుకు ఫైనార్ట్స్ కోర్సులతో పాటు డిగ్రీలోనూ వాటిని పాఠ్యాంశాలుగా చేర్చుతామన్నారు. గేమింగ్ రంగంలో స్థానికంగా పెట్టుబడులతో వచ్చే సంస్థలకు రాయితీలు ఇవ్వడంతో పాటు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. 23 వరకు ‘ఇండియా జాయ్’ బుధవారం ప్రారంభమైన ఇండియా జాయ్ 2019 వేదికగా ప్రపంచ డిజిటల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్లు ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఈ నెల 23 వరకు హెచ్ఐసీసీలో జరిగే ఈ ప్రదర్శనకు సుమారు 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. కాగా, ప్రపంచవేదిక మీద తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు భారత్‌కు చెందిన మీడియా, గేమింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలకు ఇండియా జాయ్ వేదికగా పనిచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ చిలుక, సినీ నిర్మాత అల్లు అరవింద్, అమేజాన్ ప్రైమ్ కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణ్యం, సినీ నటి నమ్రత శిరోద్కర్, శ్రీధర్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు. -
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజులపాటు జరగనున్న ఇండియా జాయ్-2019 కార్యక్రమం నవంబర్ 20వ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుని ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తూ ఇండియా జాయ్ ప్రతినిధులు ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇండియా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులుఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్ , మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రంగాలకు హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇమేజ్ టవర్ ఈ రంగాలకు ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు’గా పనిచేస్తుందని, ఇందులో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశంలో ఆయా రంగాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వినోద రంగాలకు సంబంధించి అద్భుతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ సినిమాలకు, చోటా బీమ్ వంటి గొప్ప కార్టూన్ సిరీస్ రూపకల్పన హైదరాబాద్ నగరంలోనే జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, ఈ- స్పోర్ట్స్ వంటి పలు కార్యక్రమాలను ఈ నాలుగు రోజుల్లో చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం వివిధ దేశాల నుంచి సుమారు 30 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. #IndiajoyinFestival is a prestigious platform for Digital, Media & Entertainment Corporations to collaborate & innovate. With more than 30,000 visitors, the 4-day conclave is expected to serve as a springboard for Indian media, entertainment companies on the world stage. — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 11, 2019 -
రెగ్యులర్ కోర్సులుగా గేమింగ్, యానిమేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫిలిం మేకింగ్ వంటి వివిధ కోర్సులపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో వాటికి డిమాండ్ ఉండనున్నందున, వాటిని రెగ్యులర్ కోర్సులుగా మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు అలాంటి కోర్సులను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్నా.. అనేకమంది వాటిని అభ్యసిస్తున్నా.. వ్యాలిడి టీ కలిగిన డిగ్రీలు అందజేసే యంత్రాంగం లేదు. వాటిని వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కలిగిన, నైపుణ్యాలు అందించే శిక్షణ కోర్సులుగానే నిర్వహిస్తుండటంతో వాటిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు గుర్తింపు లభించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని సంస్థలే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి అనుబంధంగా కొన్ని రెగ్యులర్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అనేక సంస్థలు వాటిని రెగ్యులర్ కోర్సులుగా నిర్వహించడం లేదు. వాటిని రెగ్యు లర్ డిగ్రీలు ప్రదానం చేసే కోర్సులుగా మార్పు చేయాల ని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తద్వారా అవి వ్యాలిడిటీ కలిగిన కోర్సులుగా మారడంతోపాటు ఆయా సంస్థలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వడం వల్ల పక్కాగా నిర్వహణ సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఇటీవల ఇమేజ్ టవర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీటిపై మంత్రి కేటీఆర్, ఉన్నత విద్యామండలి అధికారులు చర్చించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన ఆయా కోర్సులను రెగ్యులర్, వ్యాలిడిటీ కలిగిన కోర్సులుగా నిర్వహించాలని కేటీఆర్ సూచించడంతో ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన వి«ధివిధానాలపై మండలి అధికారులు సోమవారం సమావేశమై చర్చించారు. మరో రెండుసార్లు సమావేశమై వాటిని ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. -
గేమింగ్ సిటీ స్థలం వివాదరహితం
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో గేమింగ్, యానిమేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ (గేమ్) సిటీ స్థలంపై వివాదమేమీ లేదని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో హెరిటేజ్ రాక్స్ ఉన్నందున నిర్మాణాలు చేపట్టవద్దనే వాదన సరికాదన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో కలసి ఆయన శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 439 ఎకరాలున్న రాయదుర్గం భూమిలో హెరిటేజ్ రాక్స్ ఉన్నట్లు హుడా 2008లో పేర్కొందన్నారు. రెండు కంపెనీల (పూర్వాంకర, డీఎల్ఎఫ్)కు కేటాయించిన స్థలంలో కట్టడాలు నిర్మించరాదని హెరిటేజ్ టెక్నికల్ కమిటీ పేర్కొందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని మార్పులతో నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపిందన్నారు. సమస్య ఉన్న రెండు కంపెనీలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ నెల 6న చూపించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు వద్దని నిర్ణయించుకున్నట్టు పూర్వాంకర తెలిపిందన్నారు. సదరు సంస్థ చెల్లించిన రూ. 400 కోట్లను వాపస్ ఇస్తామన్నారు. డీఎల్ఎఫ్ సంస్థ విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతామన్నారు. ఐటీ మంత్రి, సీఎంలపై విమర్శలు సరికాదన్నారు. -
నేను చేసిన తప్పేంటి: పొన్నాల
‘గేమ్’ భూ కేటాయింపులు నా పరిధిలో లేవు సాక్షి, హైదరాబాద్: గేమింగ్ యానిమేషన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ (గేమ్) పార్కు భూ కేటాయింపుల్లో తనకేమీ సంబంధంలేదని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. దానిలో తాను చేసిన తప్పేమిటో చెప్పాలన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ నేతలు తనపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. గురువారమిక్కడ పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్న ఆ భూమిలో కొంత భాగాన్ని గతంలో బయోడైవర్సిటీ, మెట్రోరైలు, ట్రాన్స్‌కోలకు కేటాయించగా.. మరికొంత భూమిని గేమ్ పార్కు నిర్మాణానికిచ్చారు. శంకుస్థాపన నిర్ణయం కూడా సీఎం, అధికారులు తీసుకున్నారు. అలాంటప్పుడు నన్ను టార్గెట్ చేయడమేంటి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేయడం ద్వారా ఆ భూమిని వారికి కావాల్సిన పారిశ్రామికవేత్తకు దక్కేలా టీడీపీ, టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేసినట్లు కన్పిస్తోందన్నారు.