త్వరలో రెండు కొత్త గేమ్‌ల ఆవిష్కరణ | KRAFTON India Gaming Incubator ready to innovate new games | Sakshi
Sakshi News home page

త్వరలో రెండు కొత్త గేమ్‌ల ఆవిష్కరణ

Published Thu, Jul 4 2024 12:02 PM | Last Updated on Thu, Jul 4 2024 5:55 PM

KRAFTON India Gaming Incubator ready to innovate new games

2023లోనే ప్రారంభమైన మెంటార్‌షిప్‌

భారతదేశ గేమింగ్‌ పరిశ్రమలో రిడైమెన్షన్‌ గేమ్స్‌, షురా గేమ్స్‌ అనే కొత్త ఆన్‌లైన్‌ గేమ్‌లను త్వరలో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొరియన్‌ గేమింగ్‌ పబ్లికేషన్‌ సం‍స్థ క్రాఫ్టన్‌ తెలిపింది. గేమింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కేఐజీఐ (క్రాఫ్టన్‌ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్) ప్రోగ్రామ్‌ కింద ఈ ఆవిష్కరణలు చేపట్టినట్లు క్రాఫ్టన్‌ పేర్కొంది.

‘నివేదికల ప్రకారం భారతదేశ గేమింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2022 సంవత్సరం చివరి నాటికి దేశంలో 50.7 కోట్ల మంది ఆన్‌లైన్‌ ఆటలపై ఆసక్తిగా ఉన్నారు. 2023లో వీరి సంఖ్య 12 శాతం పెరిగి 56.8 కోట్లకు చేరింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత గేమింగ్‌ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, విలువలకు పెద్దపీట వేస్తూ గేమ్‌లను తయారు చేయాలన్నారు. దాంతో ఈ రంగంలో అపార అవకాశాలున్నాయని గుర్తించాం. ఈ పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారికి నిర్మాణాత్మక మెంటార్‌షిప్ అవసరం ఉంది. దాంతో 2023లో క్రాఫ్టన్‌ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్-కేఐజీఐని ప్రారంభించాం. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన కంపెనీలకు గేమింగ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లను, క్రాఫ్టన్‌ గ్లోబల్ స్టూడియోస్ ద్వారా మెంటార్‌షిప్‌ను అందిస్తున్నాం. దాంతోపాటు కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి డేటా అనలిటిక్స్‌తోపాటు వాటి అవసరాలను బట్టి రూ.41 లక్షలు-రూ.1.2 కోట్లు వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం’ అని తెలిపింది.

ఇదీ చదవండి: యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!

‘కంపెనీ అందిస్తున్న వసతులను, మెంటార్‌షిప్‌ను ఉపయోగించుకుని ఇటీవల రిడైమెన్షన్ గేమ్స్, షురా గేమ్స్ అనే రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2018లో నాగాలాండ్‌లోని కోహిమాలో ముగ్గురు సభ్యులతో రిడైమెన్షన్ గేమ్స్ ప్రారంభమైంది. ఈ కంపెనీ 2024లోనే సోజర్న్‌ పాస్ట్‌ పేరుతో యానిమేషన్‌ గేమ్‌ను విడుదల చేయనుంది. బెంగళూరుకు చెందిన షురా గేమ్స్ అనే కంపెనీ స్పైస్ సీక్రెట్స్ పేరుతో ఫజిల్‌గేమ్‌ను పరిచయం చేయనుంది. దీన్ని అన్ని వయసుల వారు ఆడేలా రూపొందించారు’ అని క్రాఫ్టన్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement