డిస్‌కార్డ్‌ వంటి మరెన్నో యాప్స్‌.. | How Discord played a surprising backstage role to Nepal Movement? | Sakshi
Sakshi News home page

డిస్‌కార్డ్‌ వంటి మరెన్నో యాప్స్‌..

Sep 17 2025 12:03 PM | Updated on Sep 17 2025 3:02 PM

How Discord played a surprising backstage role to Nepal Movement?

నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్‌జీ యువతకు కమ్యునికేషన్‌ సాధనంగా ‘డిస్‌కార్డ్‌’ యాప్‌ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్‌ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్‌ యాప్‌లో ఇంటర్నల్‌ కమ్యునికేషన్‌ టూల్‌గా వాడే డిస్‌కార్డ్‌ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్‌నేవిస్క్‌ 2015లో డిస్‌కార్డ్‌ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్‌ఫామ్‌. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్‌ కమ్యునికేషన్‌ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్‌జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంత​ృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్‌ టూల్స్‌లో ఉన్న డిస్‌కార్డ్‌ యాప్‌ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్‌ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.

ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్‌లోడ్‌ల పరంగా డిస్‌కార్డ్‌ నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇది మొత్తం ఇన్‌స్టాల్స్‌లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది. ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి యువత సెర్చ్‌ చేస్తోంది. వాటిలో కొన్నింటి వివరాలు కింద చూద్దాం.

యాప్‌ముఖ్య లక్షణాలుఎవరి కోసం అంటే..
గిల్డెడ్వాయిస్, వీడియో, బాట్గేమింగ్ కమ్యూనిటీలు
టీమ్ స్పీక్అల్ట్రా-లో లేటెన్సీ వాయిస్, మిలిటరీ-గ్రేడ్ ఎన్ క్రిప్షన్ఈస్పోర్ట్స్‌, ఎఫ్‌పీఎస్‌ పోటీ దారులకు..
మంబుల్‌ఓపెన్ సోర్స్, ఎన్ క్రిప్టెడ్ వాయిస్ చాట్గోప్యంగా ఉండాలనుకునే గేమర్లు
టాక్స్పీర్-టు-పీర్ మెసేజింగ్గేమింగ్ సమూహాలు

 

ఇదీ  చదవండి: బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement