Discord
-
గూగుల్ బాటలో డిస్కార్డ్.. మళ్ళీ 170 మంది
2023లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న ఉద్యోగులకు.. 2024 కూడా కలిసి రాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. ఈ వరుసలో తాజాగా ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'డిస్కార్డ్' (Discord) చేరింది. డిస్కార్డ్ కంపెనీ 2023 ఆగష్టులో 40 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత.. 2024లో తమ ఎంప్లాయిస్ను తొలగించడం ఇదే మొదటి సారి. ఇప్పడూ కంపెనీ 170 మంది (17 శాతం) ఉద్యోగులను తీసివేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 700 మందికి చేరుకున్నట్లు తెలుస్తోంది. డిస్కార్డ్ సీఈఓ జాసన్ సిట్రాన్ ప్రకారం.. 2020లో నియామకాలు పెరిగిన తరువాత కరోనా ప్రభావం వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని భావించినట్లు.. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధరలు గూగుల్ & అమెజాన్ కూడా.. 2024 ప్రారంభంలో కేవలం డిస్కార్డ్ కంపెనీ మాత్రమే కాకుండా అమెజాన్, గూగుల్ కంపెనీలు కూడా ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని గూగుల్ ఇంటికి పంపింది. -
మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు
వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పావులు కదుపుతోంది. డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లతో డిస్కార్డ్ను కొనుగోలు చేయాలనుకుంటునట్లు సమాచారం. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇరు కంపెనీల ప్రతినిధులు కొనుగోలు విషయంపై క్లారీటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్, గిట్ హబ్, మైన్క్రాఫ్ట్ను కొనుగోలు చేసింది. ఈ వేదికలు కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.గతంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలకున్న, అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది. డిస్కార్డ్ మెసేజింగ్ యాప్‌తో యూజర్లకు వీడియో, వాయిస్, టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ సేవలను అందిస్తుంది. ఈ యాప్ కరోనా మహమ్మారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందింది.100 మిలియన్లకు పైగా యూజర్లను డిస్కార్డ్ కలిగి ఉంది.ప్రముఖ గేమింగ్ బ్రాండ్ ఎక్స్ బాక్స్ కు రూపకల్పన చేసింది డిస్కార్డే. గత ఏడాది డిసెంబరు వరకు కంపెనీ విలువ 7 బిలియన్ల డాలర్లకు చేరింది.అంతేకాకుండా దీనిని ఐపీవో కంపెనీగా మార్చాలని నిర్వహకులు భావిస్తున్నారు. గతంలో డిస్కార్డే ఏపిక్ గేమ్స్, అమెజాన్ కంపెనీలతో చర్చలు జరిపింది. (చదవండి: గూగుల్‌పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!) -
ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి
ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న కోవిడ్ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్టెక్లు తెలిపాయి. భారత్‌లో రికవరీ రేటు 92.89% భారత్‌లో కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో 47,905 బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,916కు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.89% శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం పేర్కొంది. అదేవిధంగా, ఈ వ్యాధితో 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 550 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 1,28,121గా నమోదైంది. కోవిడ్ టీకా పరిశోధనలకు రూ.900 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కోవిడ్ సురక్ష మిషన్ కోసం ఈ నిధులను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని పంపణీ కోసం వేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. -
‘అ’సమ్మతి
ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు క్రమంగా చల్లారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన సమయంలో భగ్గుమ న్న అసమ్మతి నేతలు.. రోజులు గడుస్తున్న కొద్దీ మెత్తబడుతున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో పునరాలోచనలో పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చి అసెంబ్లీని రద్దు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేసిన వెంటనే ఎల్లారెడ్డి, బాల్కొండ నియోజకవర్గాల్లో అసమ్మతి తెరపైకి వచ్చింది. మిగిలిన చోట్ల మాత్రం అంతర్గతంగా రగులుకుంటోంది. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని తిరిగి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ అసమ్మతిరాగం ఆలపించారు. అప్రమత్తమైన రవీందర్‌రెడ్డి జనార్దన్‌గౌడ్‌ను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరగా.. ఆశించిన స్పందన కరువైంది. దీంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి గెలుపునకు పూర్తి సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ చెప్పడంతో జనార్దన్‌గౌడ్ అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాల్కొండలో.. బాల్కొండ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన అసమ్మతి సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఖరారు చేయడంతో ఆ నియోజకవర్గంలోని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునిల్‌రెడ్డి అసమ్మతి గళం వినిపించారు. తన అనుచరులతో వేల్పూర్ మండలంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అనుచరుడైన సునిల్‌రెడ్డి ఈసారి బీఎస్పీ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అసమ్మతి నేత బరిలో ఉంటే పరోక్షంగా ప్రశాంత్‌రెడ్డికి ప్రయోజనం చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే కాస్త వ్యతిరేక ఓట్లు చీలిపోయి, పరోక్షంగా టీఆర్ఎస్కు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లోనూ.. కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. కానీ బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ దాదాపు ఖరారైనట్లే. ఆర్మూర్‌లో ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆకుల లలితకు అధినాయకత్వం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరారైన ఈ మూడు స్థానాల్లో రెండుచోట్ల అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. కామారెడ్డిలో ఆ పార్టీ పీసీసీ కార్యదర్శి నల్లవెల్లి అశోక్ అసమ్మతి రాగం వినిపించారు. తన పేరును కూడా పరిశీలించాలని పీసీసీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అసమ్మతి నేతను బుజ్జగించేందుకు షబ్బీర్‌అలీ అశోక్‌తో మాట్లాడారు. విభేదాలను పక్కన బెట్టి ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కారెక్కడంతో ఇక్కడ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం కలిసొచ్చింది. టీపీసీసీ అధినాయకత్వం కూడా ఆకుల లలితకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆకుల లలిత అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశాలుండడంతో ఇక్కడ అసమ్మతి సెగలు రాజుకున్నాయి. సురేశ్‌రెడ్డి అనుచరుడిగా పనిచేసిన మార చంద్రమోహన్ అసమ్మతి రాగం అందుకున్నారు. అలాగే కాంగ్రెస్‌లో చేరిన రాజారాం యాదవ్ సైతం అసమ్మతిని తెలియజేశారు. ఆర్మూర్‌లో ఈ నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. ఈ బాధ్యతలను మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇప్పటికే ఓ కొలిక్కి వస్తుండగా, ఎన్నికల సమయం నాటికి అసమ్మతి సెగలు పూర్తిగా చల్లారుతాయని ఆయా పార్టీల వర్గాలు భావిస్తున్నాయి. -
ఉత్సాహం..విషాదం కావద్దు
నూతన సంవత్సర వేళ అప్రమత్తం మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత 100 బృందాలతో తనిఖీలు కమిషనర్ సీవీ ఆనంద్ మాదాపూర్: నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతులకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ముఖ్యంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడాన్ని నివారించేందుకు 100 బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘నూతన సంవత్సర వేడుకలను భాధ్యతాయుతంగా నిర్వహించాల’నే అంశంపై మాదాపూర్‌లోని ఎన్‌కన్వెషన్‌లో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ భద్రంగా, ప్రమాదాలకు తావులేకుండా పార్టీలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రమాదాలను తగ్గించగలిగామని, ఎటువంటి ప్రాణనష్టం కలుగలేదని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా ప్రమాదాలకు తావు లేకుండా చూస్తామని తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత చాలా ముఖ్యమైన అంశమన్నారు. స్త్రీల కోసం తగిన సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, ఆ ప్రదేశాల్లో అవాంఛనీయసంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘బ్యాడ్ న్యూస్ బ్యాగ్’ను ఆయన ఆవిష్కరించారు. 40వేల బ్యాడ్ న్యూస్ బ్యాగ్‌లను రిటైల్ దుకాణాలలో పంచనున్నట్టు తెలిపారు. ఈ బ్యాగ్‌లపై రోడ్డు ప్రమాదాల దృశ్యాలు, వార్తలు ముద్రించారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్స్ నౌ సంస్థ మేనేజర్ రాజ్ పాకాల, వెంకట్ రామన్, విపిన్ తదితరులు పాల్గొన్నారు.