2023లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న ఉద్యోగులకు.. 2024 కూడా కలిసి రాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. ఈ వరుసలో తాజాగా ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'డిస్కార్డ్' (Discord) చేరింది.
డిస్కార్డ్ కంపెనీ 2023 ఆగష్టులో 40 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత.. 2024లో తమ ఎంప్లాయిస్‌ను తొలగించడం ఇదే మొదటి సారి. ఇప్పడూ కంపెనీ 170 మంది (17 శాతం) ఉద్యోగులను తీసివేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 700 మందికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
డిస్కార్డ్ సీఈఓ జాసన్ సిట్రాన్ ప్రకారం.. 2020లో నియామకాలు పెరిగిన తరువాత కరోనా ప్రభావం వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని భావించినట్లు.. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధరలు
గూగుల్ & అమెజాన్ కూడా..
2024 ప్రారంభంలో కేవలం డిస్కార్డ్ కంపెనీ మాత్రమే కాకుండా అమెజాన్, గూగుల్ కంపెనీలు కూడా ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని గూగుల్ ఇంటికి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment