Visual Effects
-
అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా..
తెలుగు నటుడు రానా దగ్గుబాటి తన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియా సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఓ సమావేశంలో రానా మాట్లాడారు. ‘2005లో నా 18వ ఏటా స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీను ప్రారంభించాను. ఐదేళ్ల పాటు అందులో పనిచేశాను. ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా సినిమా తీయాలని భావించాను. కానీ అలా జరగలేదు. అయితే దాన్ని మొదట అత్యంత సృజనాత్మకంగా నిర్మించాలని అనుకున్నాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని నిర్వహణ ఖరీదైంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా అధునాతనమైనవి. దాంతో ఆ కంపెనీను మూసివేశాను. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని ప్రైమ్ ఫోకస్‌కి విక్రయించాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్లలో విడుదల కాలేదు. నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మకానికి ఉంచినపుడు నాకు బాధ అనిపించలేదు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం’అని అన్నారు. రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవర్ 170లో నటిస్తున్నారు. రానా విక్రయించిన స్పిరిట్ మీడియా 'కల్కి 2898 AD' సినిమా అంతర్జాతీయ మార్కెటింగ్ భాగస్వామిగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. -
యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు విపరీతమైన డిమాండ్.. అలా చేస్తే సూపర్ సక్సెస్
అద్భుత దృశ్యాలను వర్ణించడానికి...‘రెండు కళ్లు సరిపోవు’ అంటాం. అద్భుత దృశ్యాలను సృష్టించడానికి రెండు కళ్లతో పాటు మూడోకన్ను కూడా అవసరం.దాని పేరే... క్రియేటివ్ ఐబూమింగ్ మార్కెట్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం ఒక కోణం అయితే, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతరం క్రియేటివిటీకి విశాలమైన వేదిక దొరకడం అనేది మరో కోణం... ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల అభినవ్ భరద్వాజ్ ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. వీఎఫ్ఎక్స్, యానిమేషన్లో డిగ్రీ పూర్తి చేసిన అభినవ్‌కు ఎన్నో పురాణ పాత్రలపై అవగాహన ఉంది. ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ట్, డిజైనింగ్‌ను కెరీర్‌గా చేసుకున్న అభినవ్ లాక్డౌన్ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్‌పై లెక్కలేనన్ని డిజైన్లను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సృష్టించాడు. వాటికి మంచి స్పందన రావడం ఒక ఎత్తయితే పాపులర్ బ్రాండ్ల నుంచి అవకాశాలు రావడం మరో ఎత్తు. ‘మనకు ఉన్న రెండు కళ్లతో పాటు క్రియేటివ్ ఐ అనే మూడో కన్ను కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే బ్రాండ్ డిజైనింగ్ నుంచి సినిమా వీఎఫ్ఎక్స్ వరకు రాణించగలం’ అంటాడు అభినవ్. కలర్స్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకు అతడి యూనిక్ స్టైల్ స్టేట్మెంట్కు యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో బెంగళూరుకు చెందిన శ్రీతేజస్వి ఒకరు. డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్న తేజస్వి వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తుంది. ఆ సాంకేతికత గురించి తన అభిప్రాయాలను ఫేస్బుక్లో రాస్తుంది. వినోద రంగంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి ఇది బంగారు కాలం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ స్టూడియోల సంఖ్య పెరుగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు... మొదలైన నగరాలు యానిమేషన్ కంపెనీలు, అకాడమీలకు కేంద్రాలుగా మారాయి. మన దేశానికి పెద్ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ రంగంలో 2025 కల్లా 75,000 నుంచి 1,25,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. కమర్షియల్స్, వెబ్ సిరీస్, మూవీస్, వోటీటీకి హై–క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఈ నేపథ్యంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు ప్రాధాన్యత పెరిగింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ బిజినెస్ కాంబినేషన్ యువతను ఆకర్షిస్తుంది. కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యానిమేషన్‌కు డిమాండ్‌ను పెంచే కథలను సిద్ధం చేస్తోంది. ‘వీఎఫ్ఎక్స్, యానిమేషన్లకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. అంచనాలకు అందని విధంగా ఈ రంగం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వీఎఫ్ఎక్స్ అనేది సాంకేతికత మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. కథాసం విధానంలో భాగం’ అంటున్నాడు వీఎఫ్ఎక్స్ నిపుణుడు రాజీవ్ కుమార్. స్కూల్ రోజుల నుంచే వీఎఫ్ఎక్స్ అంటే రాజీవ్‌కు ఆసక్తి. అయితే దాన్ని కెరీర్‌గా ఎలా చేసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు. పుణెలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన రాజీవ్ ముంబైకి వెళ్లి వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీతో ప్రయాణం మొదలుపెట్టి భారీ విజయం సాధించాడు. మలయాళ చిత్రం కందిట్టుండు (అది చూడు) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. 25 సంవత్సరాల అదితి క్రిష్టదాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (ఎన్ఐడీ) లో యానిమేషన్ కోర్సు చేసిన అదితి క్రిష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంది చెన్నైకి చెందిన ప్రియాంక సుబ్రమణియన్. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా మూవింగ్ పిక్చర్ కంపెనీకి తరచు వెళ్లేది. ఇండస్ట్రీ ధోరణులను అర్థం చేసుకోవడం కోసం ఎందరో కళాకారులతో మాట్లాడేది. పుస్తకాలు చదివేది. స్టూడియోలలో అవసరమైన వారికి టీ, కాఫీలు, వోల్డ్ టేప్‌లు, హార్డ్ డిస్క్‌లు అందించేది. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ప్రియాంక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని కలలు కనేది. వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపంలో తన కలను సాకారం చేసుకుంది. మీ శక్తి వృథా చేయవద్దు వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి నిరుపయోగం కాకుండా చూసుకోవాలి. – ప్రియాంక సుబ్రమణియన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అ కథలు మళ్లీ ఇప్పుడు మనకు తరతరాల కథల సంపద ఉంది. అమ్మమ్మలు, నానమ్మల నోటి నుంచి కథలు వినే దృశ్యాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన ఎన్నో కథలను పిల్లలకు ఆకట్టుకునేలా చెప్పవచ్చు. యానిమేషన్ ఫిల్మ్స్ అంటే ఫన్నీ కార్టూన్స్‌ను మాత్రమే కాదు. – అదితి క్రిష్ణదాస్, డైరెక్టర్ -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
గేమింగ్, యానిమేషన్ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ హబ్ (ఏవీజీసీ)గా మార్చేందుకు ప్రగతిశీల, స్థిరమైన వ్యక్తిగత పన్నుల విధానం అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గేమింగ్ ఆదాయంపై అత్యధికంగా 30 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయడం అన్నది ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ఆఫ్‌షోర్ పాŠల్ట్ఫామ్లు ఎలాంటి పన్నులు చెల్లించకుండా, నియంత్రణల పరిధిలోకి రాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధమైన పన్నుల ఎగవేత అన్నది ప్రభుత్వ ఖజానాకు పెద్ద నష్టమని, అంతిమంగా దేశీ పరిశ్రమకు మరణశాసనమని పేర్కొన్నారు. ఆన్లైన్లో నైపుణ్యాల ఆధారిత గేమింగ్ పరిశ్రమ పరిమాణం 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఏటా 38 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధితో 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాటరీల మాదిరి ఆన్లైన్ స్కిల్ గేమ్‌ల్లో భారీ ఆర్జన ఉండదని, కేవలం కొద్ది మందే ఆడతారని గేమ్స్24ఇంటూ7 వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ థంపి తెలిపారు. కనుక ఒక ఆటగాడు 70 శాతం గేముల్లో గెలిచినా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి వస్తున్నట్టు చెప్పారు. లాటరీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పన్ను చట్టాలను ఆన్లైన్ గేమింగ్‌కు అమలు చేయడం వల్ల ప్రతికూతల ఫలితాలు చూడాల్సి వస్తుందన్నారు. స్టాక్ మార్కెట్ మాదిరి కాకుండా, ఆన్లైన్ గేమర్లు అంతర్జాతీయంగా నడిచే చట్ట విరుద్ధమైన, పన్నుల పరిధిలో లేని గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అక్కడ అయితే గేమర్లు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదన్నారు. పన్నుల్లో మార్పులు అవసరం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రోషన్‌షా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలంటే, 1970 నాటి నిబంధనలను ప్రస్తుత నూతన తరం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర దేశాలు గేమింగ్ పరిశ్రమ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడాల్సి ఉంది. అమెరికాలో గేమింగ్ ఆదాయాన్ని సాధారణ ఆదాయంగానే పరగణిస్తున్నారు. అక్కడ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్రిటన్‌లో గెలుచుకున్న మొత్తంపై ఎలాంటి పన్నులేదు’’అని షా చెప్పారు. ఊహించతగిన, ప్రగతిశీల పన్నుల విధానం భారత్‌కు అవసరమన్నారు. -
ఆస్కార్ గెలిచిన ‘డూన్’.. అవార్డు రావడంలో మనోడిదే కీలక పాత్ర
ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 94 వ అకాడమీ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా కొనసాగింది. ఇక ఈ వేడుకల్లో భారత్‌కు ఎలాంటి అవార్డులు దక్కలేదు. కానీ భారత్‌కు చెందిన వీఎఫ్ఎక్స్ ఇంజనీర్ ప్రతిభతో ప్రముఖ హాలీవుడ్ చిత్రం డూన్ (Dune) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చేలా తన ప్రతిభతో మెప్పించిన ఇండియన్ గురించి తెలుసుకుందాం.. నమిత్ మల్హోత్రా.. భారత్‌కు చెందిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఇంజనీర్ నమిత్ మల్హోత్రా మార్చి 28 సోమవారం జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 2022 ఆస్కార్ అవార్డును ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ డూన్ గెలుచుకున్న తర్వాత అందరి దృష్టిని ఆకర్షించాడు. నమిత్ మల్హోత్రా విజయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ట్వీట్ చేశారు. డూన్ సినిమాకు డబుల్ నెగటివ్(DNEG) అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ను రూపొందించింది. ఈ సంస్థకు సీఈవోగా నమిత్ మల్హోత్రా వ్యవహారిస్తున్నారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. డైలీ సీరియల్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు.. నమిత్ మల్హోత్రా బాలీవుడ్ దర్శకుడు,నిర్మాత నరేష్ మల్హోత్రా పెద్ద కుమారుడు. ఆయన పూర్తిగా ముంబైలో పెరిగారు. హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకొని,జీ ఎంటర్టైన్మెంట్, స్టార్ ప్లస్ వంటి ఛానెల్స్‌లో సీరియల్స్ కోసం పని చేస్తూ...ఎడిటింగ్ స్టూడియో వీడియో వర్క్‌షాప్‌ను నమిత్ మల్హోత్రా ప్రారంభించారు. ఈ సంస్థను వీడియో వర్క్స్‌తో విలీనం చేయగా తరువాత ప్రైమ్ ఫోకస్ అనే వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ 16 నగరాల్లో 8,000 మంది నిపుణులతో గ్లోబల్ (ప్రైమ్ ఫోకస్ వరల్డ్)గా మారింది. 2డీ చిత్రాలను 3డీ చిత్రాలుగా మార్చడంలో అద్బుత విజయం సాధించింది. 2014లో ప్రైమ్ ఫోకస్ వరల్డ్‌ను బ్రిటన్‌కు చెందిన డబుల్ నెగటివ్ సంస్థలో వీలినం చేశారు. ఎన్నో చిత్రాలకు..! నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని డబుల్ నెగటివ్ అనేక ప్రతిష్టాత్మక చిత్రాలను రూపొందించింది. డబుల్ నెగటివ్ ఇంత ఘన విజయం సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలి కాలంలో విడుదలైన టెనెట్, బ్లేడ్ రన్నర్ 2049, ఫస్ట్ మ్యాన్, ఎక్స్ మెషినా, ఇంటర్స్టెల్లార్ ,ఇన్సెప్షన్ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇక ఈ సంస్థ హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ (రెండు భాగాలు), ష్రెక్ 2 , వ్రాత్ ఆఫ్ ది టైటాన్స్, కొన్ని స్టార్ వార్స్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ను అందించారు. అంతేకాకుండా ఇటీవల రిలీజైన జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్ను రూపొందించింది. చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..! -
‘పవన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించబోయే 27 వ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల పవన్ బర్త్‌డే(సెప్టెంబర్ 2) సందర్భంగా దర్శకుడు క్రిష్ ట్విట్టర్ వేదికగా పవన్ 27వ సినిమా ప్రి లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అప్పట్లో జరిగిన పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుందంటూ.. పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ 27: అభిమానులకు మరో ట్రీట్) ఇక హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్ బెన్‌లాక్ ఈ సినిమాకు (వీఎఫ్ఎక్స్)విజువల్ ఎఫెక్ట్స్ అందించనున్నారు. ఈ మేరకు ఆయన గత వారమే ట్విటర్లో స్పందించారు. ‘పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. క్రిష్, పవన్ కల్యాణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ దర్శకుడు ఈ సినిమాకు ఎంటర్ అవ్వడంతో మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోయాయి. కాగా బెన్‌లాక్ తెలుగులో పనిచేయడం ఇదే తొలిసారి. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తూ.. బెన్లాక్కు ఆల్ దబెస్ట్ చెబుతున్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని కోరుతున్నారు. (ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?) Happy Birthday to @PawanKalyan. It was a pleasure working with you and @DirKrish on the epic #PSPK27 🙏 pic.twitter.com/o0lRFcYbBE — Ben Lock (@benlock) September 2, 2020 -
రికార్డ్ బ్రేక్!
ప్రభాస్ ‘సాహో’ ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు అప్పుడే రికార్డ్ బ్రేకా అనుకుంటున్నారా? ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా చేస్తున్న కమల్ కణ్ణన్ అలానే అన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌ని ఈ సినిమాకి చేస్తున్నామని కమల్ పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానుంది. ‘సాహో’ విజువల్ ఎఫెక్ట్స్ గురించి పేర్కొన్న కమల్ కన్నన్ ప్రభాస్ 20వ సినిమా గురించి కూడా ఓ హింట్ ఇచ్చారు. ‘‘ప్రభాస్ ‘జాన్’ క్లైమాక్స్ గురించి 2019 ఆరంభంలో చెప్పి తీరాల్సిందే’’ అన్నారు కమల్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. అంటే.. ముందు క్లైమాక్స్ చిత్రీకరించి ఉంటారేమో. ఆ సంగతలా ఉంచితే.. ఇక్కడ కమల్ కన్నన్ ‘జాన్’ అన్నారు కాబట్టి ప్రభాస్ 20వ సినిమాకి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారనుకోవచ్చా? కాలమే చెప్పాలి. ఈ చిత్రానికి కె. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
సాహోలో అంతకు మించి...: ప్రభాస్
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోవటంతో.. ఆయన తర్వాతి చిత్రం సాహోను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం దుబాయ్‌లో భారీ స్థాయిలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ మాగ్జైన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ అందించాడు. చిత్రంలో గ్రాఫిక్స్‌కే అధిక ప్రాధాన్యత ఉందని చెబుతున్నాడు. ‘సాహోలో కథ చాలా కీలకం. కానీ, అంతకు మించి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించబోతున్నాం. ఇది ఒక నవల తరహాలో సాగే యాక్షన్ డ్రామా’ అని తేల్చేశాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముకేష్, జాకీష్రాఫ్, చుంకీ పాండే.. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్లో టీ సిరీస్ సంస్థ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనుంది. -
2.ఓ.. ఉత్త సినిమానేనా?
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా చాలా జాగ్రత్తగా స్టార్ డైరెక్టర్ శంకర్ 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ బిజినెస్ చేస్తోంది. రిలీజ్ డేట్లో స్పష్టత లేకపోయినా.. భారీ అంచనాలను కొనసాగించేలా మేకింగ్ వీడియోలు వదులుతూ శంకర్ మతి పొగొడుతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ సమాచారం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. 2.ఓ 3డీ వర్షన్ విడుదల ఉండబోదనేది దాని సారాంశం. నిజానికి విజువల్ ఎఫెక్ట్స్ మూలంగా చిత్ర విడుదల ఆలస్యమౌతోందన్నది తెలిసిందే. సీజీ వర్క్‌పై శంకర్ అసంతృప్తితో ఉండటమే అందుకు కారణం. పైగా 3డీ ప్రొడక్షన్ పనులను అమెరికాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించగా.. వారితో శంకర్‌కు బేధాభిప్రాయాలు తలెత్తినట్లు ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. ఈ పరిస్థితులతో 3డీ వర్షన్ విడుదల ఆలోచనను నిర్మాతలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే గనుక 2.ఓ లాంటి భారీ బడ్జెట్ మూవీని మనం మాములు చిత్రంగానే తెరపై చూస్తామన్న మాట. -
నీ మీద ఒట్టు
తెలుగులో భక్తి ప్రధాన చిత్రాల్లో ఓ అద్భుతంగా చెప్పుకునే సినిమాలోని సన్నివేశాలివి. సినిమా ప్రారంభమే అదిరిపోయే సన్నివేశాలతో ఉంటుంది. తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ను బాగా పరిచయం చేసిన సినిమా కూడా అయిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? ఊరంతా కన్నీరు పెడుతోంది. భయంతో వణికిపోతోంది. రోజూ ప్రతి ఇంట్లో ఒకరు చనిపోతున్నారు. ఆ ఇల్లు, ఈ ఇల్లు అని లేదు. సూర్యుడు దిగిపోతున్నాడు, మళ్లీ వస్తున్నాడు. ఊర్లో జనాల ప్రాణాలు ఒక్కోటీ గాల్లో కలిసిపోతున్నాయి. ఏదో మహమ్మారి రోగం. ఎవ్వరికీ ఏదీ అంతు చిక్కడం లేదు. అమ్మవారి మీదే భారం వేసేశారు, ఆమే కాపాడాలని.‘మహమ్మారి రోగమొచ్చి ఇప్పటికే చాలామంది సచ్చిపోయి, చుట్టుపక్కల ఏడూర్లూ శ్మశానాలైపోతున్నాయ్ కాబట్టి.. మనల్ని ఆ తల్లే కాపాడాలని ఊరు మధ్యలో మూడు కుండల్లో కుంభమారమేసి, అందరూ ఈ రాతిరికి జాతర చేస్తే ఆ తల్లి కాపాడుతుందని, అంజనమేసిన పెద్ద పూజారి చెప్పారహో..’ అంటూ ఊరంతా చాటింపు వేయించారు. ఊరంతా కదిలింది. ఊరు మధ్యలో పెద్ద జాతర. ప్రజలంతా భక్తితో ఆ తల్లిని కొలుస్తున్నారు. జాతర జరుగుతున్న చోటకు ఒక పెద్దావిడ వచ్చి నిలబడింది. నిండుగా చీర కట్టుకుంది. నుదుటున పెద్ద బొట్టు. పెద్ద ముక్కు పుడక. అమ్మవారికి నైవేద్యం పెడుతోన్న వాళ్ల దగ్గరకు వెళ్లి, ‘‘చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ప్రసాదం పెట్టండి.’’ అడిగింది.‘‘అమ్మో! ఇది ఆ తల్లి నైవేద్యం. ప్రసాదం కాదు. లెంపలేసుకోమ్మా!’’ అంది జాతరలో తల్లికి నైవేద్యం పెడుతోన్న ఒకామె. ‘‘బాగుందీ.. దూరం నుంచొచ్చి, ఆకలి అంటే ఈల్లేదంటారేంటీ?’’ అంటూ, ఆ పెద్దావిడ వంక చూస్తూ, ‘‘చూడమ్మా పెద్దావిడా! అది ఆ తల్లి నైవేద్యం. ఇదింకా నా చేతిలోనే ఉందిగా.. ఇది నైవేద్యం కాదులే తీసుకొని తిను..’’ అంటూ తన చేతిలోని కుండను పెద్దావిడ చేతిలో పెట్టబోయింది ఇంకొకామె. పెద్దావిడ ఈమె వంక చూసి చిన్నగా నవ్వింది. ‘‘అమ్మా తల్లి! నేను చేసేది తప్పైతే నన్నేమైనా చెయ్! ఈ ఊరి జనం చావు మహమ్మారిలో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడుతల్లీ!’’ అంటూ తన కుండను ఆ తల్లికి చూపిస్తున్నట్లుగా గాల్లో ఎత్తి చూపి, ఆ తర్వాత ‘‘తీస్కోమ్మా!’’ అంటూ పెద్దావిడకు ప్రసాదంగా పెట్టింది. ‘‘నువ్ నాకు పెట్టిన ఈ పిడికెడు మెతుకులే ఈ ఊరిని కాపాడతాయ్!’’ అంటూ ధైర్యమిస్తున్నట్లు చెప్పింది పెద్దావిడ. ఆ తల్లికి పెద్దఎత్తున జాతర చేసిన ఊరంతా నిద్రపోతోంది. పెద్దావిడకు అన్నం పెట్టిన వ్యక్తి, తన ఇంటి తలుపును ఎవరో కొడుతున్నట్లు అనిపించి, లేచి చూసింది. గడప ముందు మళ్లీ ఆ పెద్దావిడ. ‘‘ఏంటమ్మా పెద్దావిడా! నువ్వింకా ఎల్లిపోలేదా? అసలే రోజులు బాలేవు. రోగాల రోజులు.’’ చెప్పుకుంటూ పోతోంది ఆమె.‘‘నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే! ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు తట్టాను..’’ అంది పెద్దావిడ. పెద్దావిడ రెండు చేతుల నిండా వేప ఆకులు. ఇంటామె పెద్దావిడను ఇంట్లోకి రమ్మంది. ఇంట్లో ఓ దగ్గర కూర్చొని, వేపాకును నూరడం మొదలుపెట్టింది పెద్దావిడ. ‘‘ఈ అర్ధరాత్రి పూట యేపాకు నూరడం ఏంటి? ఎందుకు?’’ అనడిగింది ఇంటామె. ‘‘చూడూ.. ఈ వేప నీళ్లు ఊళ్లో ప్రతీ గడప మీదా చల్లుకుంటూ.. పొలిమేర దాకా వెళ్లి, పొలిమేరలో పోసి రా!’’ అంది పెద్దావిడ.‘‘అది కాదే! నడిజాము దాటితే, మహమ్మారులు ఊరి పొలిమేరలు దాటుతున్నారే.. ఈ ఊరిని మొత్తం తినేస్తారే!’’ అంది పెద్దావిడ.‘‘మానవమాత్రులం మనమేం చేయగలం చెప్పు.. కాపాడితే.. ఆ తల్లే కాపాడాలి..’’ అంది ఆ ఇంటామె, పెద్దావిడ వంకే చూస్తూ.వేపాకు ముద్దనంతా చేతిలోకి తీసుకొని, ఆ ముద్దను బిందెలోని నీళ్లలో కలిపింది పెద్దావిడ. ఇంటామెకు ఏమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ కూర్చుంది. ‘‘చూడూ.. ఈ వేప నీళ్లు ఊళ్లో ప్రతీ గడప మీదా చల్లుకుంటూ.. పొలిమేర దాకా వెళ్లి, పొలిమేరలో పోసి రా!’’ అంది పెద్దావిడ.‘‘బాగుందీ నీ చాదస్తం. ఈ అర్ధరాత్రేల ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే.. నా గుడిసెవరు చూత్తారూ..’’ అంది ఇంటామె.‘‘చాదస్తం కాదే! ఈ నీళ్లు చల్లితే, ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు. తొలిజాముకల్లా చల్లిరా.. నువ్వు తిరిగొచ్చే వరకూ నేనిక్కణ్నించి వెళ్లను.’’ అంది పెద్దావిడ, ధైర్యమిస్తూ. ‘‘నిజంగా ఉంటావా మరి?’’‘‘నిజంగా ఉంటాను.. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చేవరకూ, ఈ గుడిసెనే కాదు.. ఈ ఊరి నించే వెళ్లను..’’ ‘‘నా మీదొట్టు?’’ అడిగింది ఇంటామె, అమాయకంగా. ‘‘నీ మీద ఒట్టు..’’ అంటూ ఇంటామె తలపై చెయ్యి వేస్తూ మాటిచ్చింది పెద్దావిడ. పెద్దావిడ, ఆ ఇంటామె చేతికి బిందెను అందించింది. ‘‘చూడూ.. వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్లూ..’’ చిన్నగా హెచ్చరిస్తూ చెప్పింది పెద్దావిడ. ‘‘సరే నీ మాట నమ్మి వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్తమ్మో! ఒట్టేసావ్.. మర్చిపోకు..’’ అంటూ బిందె అందుకొని లేచింది ఇంటామె. పెద్దావిడ చిన్నగా నవ్వింది. ఊర్లో గడపలన్నీ దాటుతూ, ఆ వేపాకు చలువ చల్లుతూ వెళుతోంది ఇంటామె.ఒక్కసారే ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది. ‘అయ్యో! ముసల్ది ఎంగిలి పడిందో లేదో! ఉట్టిమీద అన్నం ఉందీ.. పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను..’ అనుకుంటూ వెనక్కి తిరిగింది.ఇంట్లో పెద్దావిడ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఊగిపోతోంది. కళ్లన్నీ ఎర్రబడ్డాయి. ఇల్లంతా ఆమె వెలుగు నింపుకుంది. ఇంటామెకు భయమేసింది.ఇంట్లోకి అడుగుపెట్టకుండానే, బయట కిటికీ నుంచి ఇదంతా చూస్తూ వణికిపోయింది. రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంది. ‘నా ఇంటికొచ్చింది ఆ అమ్మవారేనా! ఊరిని కాపాడడానికి వచ్చిందా? ఆ తల్లి ఇక్కడే ఉంటే ఊరికి ఏ చెడూ రాదుగా!! కానీ తెల్లారితే ఆ తల్లి ఎల్లిపోద్దేమో?’ ఆలోచిస్తోంది ఇంటామె. ‘నువ్వు తిరిగొచ్చేదాకా ఈ ఊర్నించి నేను వెళ్లను..’ పెద్దావిడ మాటను గుర్తుతెచ్చుకుంది. ‘నేను తిరిగెళ్లను. ఆ తల్లిని తిరిగి ఎల్లనివ్వను..’ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి, ఊరు పొలిమేరలో ఉన్న చెరువులో దూకేసింది ఇంటామె. పెద్దావిడ గట్టిగా ఊపిరి తీసుకుంటూ కోపంగా పైకి చూసింది. ‘అమ్మా నేనొచ్చేదాకా ఉంటానని మాటిచ్చావ్.. ఉంటావ్గా!’ పెద్దావిడకు ఆ ఇంటామె మాటొకటి వినిపించింది. ‘ఉంటానే! ఎప్పటికీ ఇక్కడే ఉంటా..’ సమాధానమిచ్చింది పెద్దావిడ. ఆ పెద్దావిడే ఇక ఆ ఊరికి తల్లి. అమ్మవారు. గ్రామదేవత. -
రాజమౌళితో పాటు మాకు సవాలే!
‘‘సన్నివేశాల్లోని భావోద్వేగాలను (ఎమోషన్స్) తెరపై ఆవిష్కరించడంలో విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) సహాయపడతాయి. అంతే తప్ప... గ్రాఫిక్స్ ఎప్పుడూ భావోద్వేగాలను డామినేట్ చేయలేవు. సినిమాకు గ్రాఫిక్స్ మద్దతుగా నిలుస్తాయంతే’’ అన్నారు కమల్ కణ్ణన్. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి–2’కి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పని చేశారీయన. వచ్చే శుక్రవారం విడుదలవుతోన్న ఈ సినిమా గురించి కమల్ కణ్ణన్ చెప్పిన సంగతులు... ►‘సై’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చేయమని రాజమౌళి నుంచి తొలిసారి కబురొచ్చింది. అందులో గ్రాఫిక్స్ వర్క్ తక్కువే. తర్వాత ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలకు ఆయనతో పనిచేశా. ‘యమదొంగ’కు నాకు నంది అవార్డు వచ్చింది. ►ఏదైనా సీన్లో రాజమౌళి చెప్పినట్టు గ్రాఫిక్స్ చేయడం కుదరదంటే ఒప్పుకోరు. గూగుల్‌లో వెతుకుతారు. నేరుగా విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టుతో మాట్లాడతారు. వర్క్ పరంగా రాజమౌళిని శాటిస్ఫై చేయడం చాలా కష్టం. ప్రతి అంశంపై ఆయనకు పట్టుంది. ►అక్టోబర్ 16, 2015న నేను ‘బాహుబలి–2’ టీమ్‌లో చేరాను. అప్పటికే వర్క్ ప్రారంభమైంది. 2,555 షాట్స్‌లో గ్రాఫిక్స్ అవసరమని గుర్తించాను. లాస్ ఏంజెల్స్‌లోని జాన్ గ్రిఫిక్స్ అనే వ్యక్తి వార్ సీన్స్ కంప్లీట్ చేసేశాడు. ఈ 18 నెలల్లో 2200 షాట్స్‌లో గ్రాఫిక్స్ పూర్తి చేయడమంటే జోక్ కాదు. మన దేశంలోనూ, విదేశాల్లోనూ సుమారు 50 స్టూడియోలు ‘బాహుబలి–2’కి పని చేశాయి. ►‘బాహుబలి’తో పోలిస్తే రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఇందులో మాహిష్మతి రాజ్యాన్ని పూర్తిగా చూడొచ్చు. దేవసేనకు చెందిన కుంతల రాజ్యం కూడా ఈ పార్టులోనే ఉంటుంది. మాహిష్మతి, కుంతల రాజ్యాల మధ్య తేడాను చూపించడం దర్శకుడితో పాటు మాకు సవాల్‌గా నిలిచింది. సినిమాలో గ్రాఫిక్స్ ఎంత గొప్పగా ఉంటాయో... ఎమోషనల్, డ్రామా కూడా అంతే గొప్పగా ఉంటాయి. ►ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడంతో... గ్రాఫిక్స్ వర్క్ త్వరగా పూర్తి కావాలని నవంబర్ నుంచి తొందర పెట్టారు. ఫిబ్రవరిలో మా వర్క్ పూర్తి చేసి, తర్వాత కరెక్షన్స్ చూడడం ప్రారంభించాం. ఇంకా ఐదు కరెక్షన్స్ చేయాలి. ►‘బాహుబలి–1’ విడుదలకు ముందు రెండో భాగంలో సుమారు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో 10 నిమిషాలు లీకయిందని విన్నాను. అందువల్ల, మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ►ఈ సినిమా గ్రాఫిక్ వర్క్‌కి ఎంత ఖర్చయిందనేది నాకు తెలీదు. దర్శకుడి ఊహలకు అనుగుణంగా వర్క్ జరుగుతుందా? లేదా? అనేది పర్యవేక్షించడం మాత్రమే నా బాధ్యత. బిల్లింగ్ అంతా ప్రొడక్షన్ టీమ్ చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా స్టూడియోలో ఖర్చు ఎక్కువని ప్రొడక్షన్ టీమ్ భావిస్తే... స్టూడియో వాళ్లతో నేను మాట్లాడేవాణ్ణి. అంతకుమించి నాకు తెలీదు కనుక... ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు గ్రాఫిక్స్‌కి ఇంత ఖర్చు అవుతుందని నిర్మాతలకు సలహాలు ఇవ్వలేను. ఇక వెయ్యికోట్లతో తీయబోతున్న ‘మహాభారతం’ చాలా పెద్ద ప్రాజెక్ట్. గ్రాఫిక్స్ కూడా చాలా కీలకం. దానికి ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ►‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్ కేటాయించడం మొదలైంది. ‘బాహుబలి’తో విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో సినిమాలు తీసేందుకు మరింత ముందడుగు వేస్తున్నారు. -
రోబోలే కాదు...పక్షులు కూడా!
ఓ శాస్త్రవేత్త సృష్టించిన రోబో అతడికి ఎదురు తిరిగితే? అమ్మాయితో ప్రేమలో పడితే? రజనీకాంత్ ‘రోబో’లో దర్శకుడు శంకర్ చూపించిన కాన్సెప్ట్ అదే కదా! అందులో రోబోలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘2.0’ వస్తోంది. ఇందులో రోబోలే కాదు... పక్షులూ నటిస్తున్నాయి. సినిమాను ముందుకు తీసుకువెళ్లడంతో పక్షులే కీలక పాత్ర పోషిస్తాయట! హిందీ హీరో అక్షయ్‌కుమార్ ఈ సినిమాలో దుష్టుడైన ఓ శాస్త్రవేత్త పాత్రలో విలన్‌గా కనిపిస్తారు. ఇప్పటికే విడుదల చేసిన అక్షయ్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఇందులో అక్షయ్ పక్షుల ప్రేమికుడిగా నటిస్తున్నారట! అంతే కాదు... సినిమా మెయిన్ థీమ్ అంతా పక్షులు, వాటి లక్షణాల చుట్టూ ఉంటుందట! ‘‘అందుకనే ఈ చిత్రం షూటింగ్ కోసం మకావ్స్, కాకటోస్, బూడిద రంగులో ఉండే ఆఫ్రికన్ రామచిలుకలు తదితర అరుదైన పక్షులను తీసుకొచ్చారు. చెంగల్పట్టు, తిరుక్కళకుండ్రమ్ దగ్గరలో వేసిన భారీ సెట్లో ఆ పక్షులతో పాటు అక్షయ్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. మొత్తం మీద ‘2.0’ కాన్సెప్టే కాదు, సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తుండడం కూడా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కోసమే 350 కోట్లు అనుకున్న బడ్జెట్‌ను 400 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రమిదే అంటున్నారు. బడ్జెట్‌కు తగ్గట్టు తెలుగు, తమిళం, హిందీలతో పాటు పలు భారతీయ భాషల్లోనూ, విదేశాల్లోనూ భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. నేరుగా 3డిలోనే తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి రిలీజయ్యే లోగా ఇంకెన్నో విశేషాలు బయటకొస్తాయనడంలో సందేహం ఏముంది! -
లండన్‌లో...
హాలీవుడ్ చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్)కి ప్రాధాన్యం ఉంటుంది. ఐరన్ మ్యాన్ 2, బ్యాట్‌మేన్- ది డార్క్ నైట్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్, 2012, 10,000 బీసీ... ఇలా విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఆ విభాగంలో పని చేయడంతో పాటు, ఓ షార్ట్ ఫిలింకి కూడా దర్శకత్వం వహించారు తెలుగు కుర్రాడు నవీన్ మేడారం. ఇప్పుడు అసద్ షాన్, యాంబర్ రోజ్ ముఖ్య తారలుగా తెలుగులో ‘లండన్ లైఫ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. నవీన్ మాట్లాడుతూ - ‘‘ఇండియా నుండి లండన్ వెళ్లిన నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉంటారు. అప్పుడు వాళ్లకు ఎదురయ్యే సంఘటనలతో ఈ చిత్రం చేశా. ఇక్కడ అభిషేక్ పిక్చర్స్, లండన్, అమెరికాలో కేవీ పిక్చర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నా దగ్గర ఎనిమిది కథలున్నాయి. త్వరలో మరో తెలుగు సినిమా చేయబోతున్నా’’ అని చెప్పారు. -
మేకింగ్ ఆఫ్ 'సాహసం'-ప్రోమో
-
మేకింగ్ ఆఫ్ మూవీ