రికార్డ్‌ బ్రేక్‌! | record break of sahoo visual effects | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ బ్రేక్‌!

Published Thu, Jan 10 2019 2:08 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

record break of sahoo visual effects - Sakshi

ప్రభాస్‌ ‘సాహో’ ఓ రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. ఇంకా సినిమానే రిలీజ్‌ కాలేదు అప్పుడే రికార్డ్‌ బ్రేకా అనుకుంటున్నారా? ఈ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌గా చేస్తున్న కమల్‌ కణ్ణన్‌ అలానే అన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయనటువంటి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సీన్స్‌ని ఈ సినిమాకి చేస్తున్నామని కమల్‌ పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానుంది.

‘సాహో’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి పేర్కొన్న కమల్‌ కన్నన్‌ ప్రభాస్‌ 20వ సినిమా గురించి కూడా ఓ హింట్‌ ఇచ్చారు. ‘‘ప్రభాస్‌ ‘జాన్‌’ క్లైమాక్స్‌ గురించి 2019 ఆరంభంలో చెప్పి తీరాల్సిందే’’ అన్నారు కమల్‌. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. అంటే.. ముందు క్లైమాక్స్‌ చిత్రీకరించి ఉంటారేమో. ఆ సంగతలా ఉంచితే.. ఇక్కడ కమల్‌ కన్నన్‌ ‘జాన్‌’ అన్నారు కాబట్టి ప్రభాస్‌ 20వ సినిమాకి ఆ టైటిల్‌నే ఫిక్స్‌ చేశారనుకోవచ్చా? కాలమే చెప్పాలి. ఈ చిత్రానికి కె. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement