
హీరో ప్రభాస్ (తాజా చిత్రం)
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోవటంతో.. ఆయన తర్వాతి చిత్రం సాహోను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం దుబాయ్‌లో భారీ స్థాయిలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ మాగ్జైన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ అందించాడు.
చిత్రంలో గ్రాఫిక్స్‌కే అధిక ప్రాధాన్యత ఉందని చెబుతున్నాడు. ‘సాహోలో కథ చాలా కీలకం. కానీ, అంతకు మించి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించబోతున్నాం. ఇది ఒక నవల తరహాలో సాగే యాక్షన్ డ్రామా’ అని తేల్చేశాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముకేష్, జాకీష్రాఫ్, చుంకీ పాండే.. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో టీ సిరీస్ సంస్థ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment