అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవరి 13). ఆయన 1949 జనవరి 13న జన్మించారు. భారతదేశ చరిత్రలో తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సాగించిన అంతరిక్ష ప్రయాణం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
1949, జనవరి 13న పంజాబ్‌లోని పటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ(Rakesh Sharma), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)మాజీ పైలట్, వ్యోమగామి. రాకేశ్‌శర్మ 1984లో 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ టీ-11లో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఆయనను జాతీయ హీరోగా చేయడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.
నాటి అంతరిక్ష మిషన్ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని శర్మను అడిగినప్పుడు ఆయన ‘సారే జహాన్ సే అచ్ఛా" (ప్రపంచమంతటి కంటే మెరుగ్గా) అని సమాధానమిచ్చారు. ఈ దేశభక్తి భావన లక్షలాది మంది భారతీయులతో ప్రతిధ్వనించింది.దేశ సమిష్టి జ్ఞాపకంలో శాశ్వతంగా నిలిచిపోయింది.
రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత, శర్మ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఏరోస్పేస్ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ తరాల కలలను సాకారం చేసేందుకు, సైన్స్, అంతరిక్ష పరిశోధనలలో మరింత ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది.
ఇది కూడా చదవండి: కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment