Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం‌ | Pope Francis death LIVE updates | Sakshi
Sakshi News home page

పోప్‌ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం‌

Published Mon, Apr 21 2025 3:57 PM | Last Updated on Mon, Apr 21 2025 4:42 PM

Pope Francis death LIVE updates

ఢిల్లీ: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్(88)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్‌ సిటీ అధికారులు ప్రకటించారు.

వాటికన్‌ సిటీ అధికారుల ప్రకటనతో దేశాదినేతలు పోప్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోప్‌ మృతిపై విచారం వ్యక్తం చేశారు.

‘పోప్ ఫ్రాన్సిస్ మరణం నాకు తీవ్ర బాధను కలిగిస్తోంది. ఈ విషాద సమయంలో ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసేందుకు కృషి చేశారు. పేదలు,అణగారిన వర్గాలకు సేవ చేశారు’అని ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌లో కొనియాడారు. 

 

 

పోప్‌ ఆత్మకు శాంతి చేకూర్చుగాక : జేడీ వాన్స్‌
భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఎక్స్‌ వేదికగా పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణంపై విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త నాకు ఇప్పుడే తెలిసింది. కోవిడ్ తొలినాళ్లలో ఆయన ఇచ్చిన ప్రసంగం మరిచిపోలేనిది. నేను ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చుగాక అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 

 

వైట్‌ హౌస్‌ ట్వీట్‌ 
పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్తపై అమెరికా శ్వేతసౌథం వర్గాలు అధికారికంగా స్పందించాయి. ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ అంటూ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నాయి. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement