సాక్షి, హైదరాబాద్: పక్షవాతం వచ్చిన మూడు గంటల్లోగా న్యూరోఫిజీషియన్ లేదా న్యూరోసర్జన్ వద్దకు వచ్చి టీపీఏ (టిష్యూ ప్లాస్మనేషన్ ఆక్టివేటర్) ఇంజెక్షన్ చేయించుకోగలిగితే వాళ్లు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందని ప్రముఖ న్యూరో ఫిజీషియన్లు డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, డా.సీహెచ్ రత్నకిషోర్ అన్నారు. బుధవారం మెడిసిటీ ఆస్పత్రిలోని సిటీ న్యూరో సెంటర్‌లో పక్షవాత అవగాహన దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సులో వైద్యులు మాట్లాడారు. పెదాలు పక్కకు లాగడం, కాలు, చెయ్యి పడిపోయినట్టు అనిపించడం, ఉన్నట్టుండి చూపు మందగించడం, భరించలేనంతగా తలనొప్పి రావడం, ఇలా అకస్మాత్తుగా వచ్చే ఏ లక్షణాన్నైనా బ్రెయిన్ స్ట్రోక్‌గా పరిగణించి తక్షణమే వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 200 మంది పక్షవాతం బారినపడుతున్నారని, వీరిలో 45 ఏళ్లలోపు వారే 15 శాతం మంది ఉండటం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా పెరాలసిస్ వచ్చినా, మూడు గంట ల్లోపే వచ్చే రోగుల శాతం 1కన్నా తక్కువే ఉందన్నారు.
ఉప్పు కొంపముంచుతోంది: ఉప్పు వాడకం మోతాదు మిం చితే విషంగా మారుతోందని, ఉప్పు వాడకం తగ్గించాలని వైద్యులు సూచించారు. పక్షవాతం రావడానికి అధిక రక్తపోటు కారణమైతే, అధిక రక్తపోటుకు ఉప్పు కారణమన్నారు.
ఆ మూడు గంటలే కీలకం!
Published Thu, Oct 30 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM
Advertisement