paralysis patients
-
ఆమె మాటలు విని ఉద్వేగానికి లోనైన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్( కోవిడ్ 19)పై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆయన జన ఔషధీ కేంద్రాల యజమానులు, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..కరోనా వైరస్‌పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని, డాక్టర్ల సలహాలు పాటించాలని ప్రజలను కోరారు. షేక్ హ్యాండ్ బదులు నమస్తే పెట్టాలని సూచించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడం అలవాటు చేసుకుంటోందని అన్నారు. భాగోద్వేగానికి లోనైన మోదీ లబ్దిదారులతో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. పక్షవాతానికి లోనై.. జన ఔషధి పథకం ద్వారా లబ్ది పొందిన దీపా షా అనే ఓ మహిళ మాట్లాడిన మాటలు విని మోదీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సరిగా మాట్లాడలేకపోయిన తాను.. తన రోగాన్ని సరిచేసుకునేందుకు ఎంతో ఖర్చయ్యే పరిస్థితి ఎదుర్కొన్నాననీ, ఐతే... జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కొని సమస్య నుంచీ బయటపడినట్లు మోదీకి వివరించారు. ‘ 2011లో నాకు పక్షవాతం వచ్చింది. దీంతో సరిగా మాట్లాడలేకపోయాను. వైద్యం ఖర్చులు భారీగా అయ్యేవి. అయితే జన ఔషధి పథకం ద్వారా నాకు పెద్ద ఉపశమనం లభించింది. జన జౌషధ కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కోగలుగుతున్నాను. రూ. 5000 విలువల చేసే మందులు.. రూ.1500 లకే లభిస్తున్నాయి. వైద్యం ఖర్చులు తగ్గడంతో కడుపు నిండా తినగలుగుతున్నాను. ఈ పథకంగా తెచ్చిన మోదీకి కృతజ్ఞతలు. నేను దేవున్ని ప్రత్యేక్షంగా చూడలేదు. మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అంటూ దీపా కనీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. కొన్ని క్షణాల పాటు తలను కిందకు దించి దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు. #WATCH Prime Minister Narendra Modi gets emotional after Pradhan Mantri Bhartiya Janaushadi Pariyojana beneficiary Deepa Shah breaks down during interaction with PM. pic.twitter.com/Ihs2kRvkaI — ANI (@ANI) March 7, 2020 -
బెడ్లు ఖాళీ లేవు..!
గుంటూరు ఈస్ట్: పాక్షికంగా పక్షవాతం వచ్చిన మహిళను జీజీహెచ్ అత్యవసర విభాగంలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకపోవడంతో ఆమె వార్డు వెలుపల తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. అదే సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటంతో వైద్య సిబ్బంది ఆమెను హడావుడిగా అత్యవసర విభాగంలోకి తరలించారు. వివరాల్లోకి వెళితే గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన వి.ఏసురత్నం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య కళావతి 3 నెలలుగా పాక్షిక పక్షవాతంతో అనారోగ్యానికి గురికాగా, ఆమెకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు.అయితే అక్కడ వేసే బిల్లులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం జీజీహెచ్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చాడు. అత్యవసర విభాంగలో వైద్యులు కళావతికి పరీక్షలు చేయించి మందులు రాసి ఇచ్చారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకునేందుకు బెడ్లు ఖాళీ లేవని నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఏసురత్నం భార్యను తీసుకుని వార్డు వెలుపలకు వచ్చాడు. తమ వెంట వచ్చిన బంధువును కళావతి వద్ద తోడుగా ఉంచి ఆటో తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండటంతో పోలీసులు ఆటోను లోపలకు అనుమతించలేదు. చేసేదేమీ లేక ఏసురత్నం తిరిగి భార్య వద్దకు రాగా, కళావతి ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై అదుపు తప్పి కింద పడిపోయింది. స్పీకర్ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటంతో వైద్య సిబ్బంది హడావుడిగా కళావతిని అత్యవసర విభాగంలోకి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఏసురత్నం కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. -
ఆ మూడు గంటలే కీలకం!
సాక్షి, హైదరాబాద్: పక్షవాతం వచ్చిన మూడు గంటల్లోగా న్యూరోఫిజీషియన్ లేదా న్యూరోసర్జన్ వద్దకు వచ్చి టీపీఏ (టిష్యూ ప్లాస్మనేషన్ ఆక్టివేటర్) ఇంజెక్షన్ చేయించుకోగలిగితే వాళ్లు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందని ప్రముఖ న్యూరో ఫిజీషియన్లు డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, డా.సీహెచ్ రత్నకిషోర్ అన్నారు. బుధవారం మెడిసిటీ ఆస్పత్రిలోని సిటీ న్యూరో సెంటర్లో పక్షవాత అవగాహన దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సులో వైద్యులు మాట్లాడారు. పెదాలు పక్కకు లాగడం, కాలు, చెయ్యి పడిపోయినట్టు అనిపించడం, ఉన్నట్టుండి చూపు మందగించడం, భరించలేనంతగా తలనొప్పి రావడం, ఇలా అకస్మాత్తుగా వచ్చే ఏ లక్షణాన్నైనా బ్రెయిన్ స్ట్రోక్‌గా పరిగణించి తక్షణమే వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 200 మంది పక్షవాతం బారినపడుతున్నారని, వీరిలో 45 ఏళ్లలోపు వారే 15 శాతం మంది ఉండటం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా పెరాలసిస్ వచ్చినా, మూడు గంట ల్లోపే వచ్చే రోగుల శాతం 1కన్నా తక్కువే ఉందన్నారు. ఉప్పు కొంపముంచుతోంది: ఉప్పు వాడకం మోతాదు మిం చితే విషంగా మారుతోందని, ఉప్పు వాడకం తగ్గించాలని వైద్యులు సూచించారు. పక్షవాతం రావడానికి అధిక రక్తపోటు కారణమైతే, అధిక రక్తపోటుకు ఉప్పు కారణమన్నారు.