Cheneta
-
చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది
సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు. తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్‌డబ్ల్యూటీవో (యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు. చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్‌ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతికి చీరల బహూకరణ చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్‌కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్ ఇక్కత్ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమారెడ్డి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ భూదాన్ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్ ఫ్యాన్ గాలి ఉధృతికి కార్పెట్ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్ ఇక్కత్, కాటన్, మస్రైస్ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి. – లోక శ్యామ్‌కుమార్ డూప్లికేట్‌ను నియంత్రించాలి టై అండ్ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్ బ్రాండ్‌ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. – కూరపాటి వెంకటేశం -
‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన!
మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఉత్సాహంతో కూడిన మద్దతు లభిస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. చేనేత కళను ప్రోత్సహిస్తూనే, ఈ పనిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతున్నదన్నారు. చేనేత పని అంత సులభం కాదని, ఇది గణితంతో ముడిపడివుందని, అలాగే ఎంతో సహనం అవసరమన్నారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్‌తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రామమందిరం ట్రస్ట్‌కు చెందిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌లు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆ చూకీ చెబితే రూ. 50 వేలు! -
సమంతను ఫాలో అవుతున్న ప్రియాంక
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సినీ స్టార్స్ క్యాంపెయిన్ చేస్తున్న విషయం విదితమే. సినీనటీ సమంత తెలంగాణ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోషల్ మీడియాలోచురుకైన పాత్ర పోషిస్తోంది. ఆ కోవలోనేచేనేతకు వన్నె తెచ్చేందుకు, దాని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు పాటుపడుతోంది ప్రియాంక దారపు. తనకిష్టమైన ఈ రంగంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకెళుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ర్యాంప్ షోలలోహొయలొలికిస్తూ చేనేత వృత్తిదారుల్లోనూతనోత్సాహాన్ని నింపుతోందీసిటీ యువతి. హిమాయత్‌నగర్ : నగరంలోని మాదాపూర్‌నకు చెందిన ప్రియాంక దారపు ఫ్యాషన్ కోర్సులో బీఎస్సీ చేసింది. ప్రస్తుతం ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌ను రన్ చేస్తూ, చేనేత రంగాన్ని బలపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ‘మిస్ తెలంగాణ 2017’ టైటిల్‌ని సాధించిన ప్రియాంక ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది. రెండేళ్లుగా ఫ్యాషన్ షోలు.. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఫ్యాషన్ షోలకు కొంతమంది మోడల్స్‌ను ఎంపిక చేశారు. వీరిలో నగరం నుంచి ప్రియాంక ఎంపికైంది. దీంతో ఆమె ఫ్యాషన్ షోలలో చేనేత కార్మికులు రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ఆ రంగానికి వన్నె తెస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే చేనేత ఫ్యాషన్ షోలలో తెలంగాణ నుంచి తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది ప్రియాంక. సోషల్ మీడియాద్వారాప్రమోషన్ కేవలం ర్యాంప్ షోలతో సరిపుచ్చుకోక తన వంతు బాధ్యతగా చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, ఆ దిశగా నేటి యువత ఓ అడుగు ముందుకు వేయాలంటూ ప్రియాంక పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ర్యాంప్ షో నుంచి సిటీకి వచ్చాక ‘ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్’ వంటి సోషల్ మీడియా వేదికగా లైవ్‌లు చేస్తోంది. ప్రస్తుతం చేనేతలో అనేక ఆకర్షణీయమైన డిజైన్లలో దుస్తులను కార్మికులు రూపొందిస్తున్నారని, వాటిని ధరించాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందంటూ లైవ్‌లో చెబుతోంది. ఖాదీ ఫ్యాబ్రిక్‌పై కోచింగ్ కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో ప్రియాంక ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించింది. ఈ ఇనిస్టిట్యూట్ వేదికగా ఫ్యాషన్ రంగంలో వస్తున్న యువతీ యువకులకు ఖాదీ ఫ్యాబ్రిక్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఫ్యాబ్రిక్‌లో లేటెస్ట్గా వచ్చే డిజైన్స్‌ని వాళ్లకి వివరిస్తూ.. కొత్తదనాన్ని పరిచయం చేస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ నా లక్ష్యం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే ర్యాంప్ షోలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ, కాకినాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఏపీతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టే కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ, ఏపీలకు ‘చేనేత రంగం’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనేది నా అభిమతం. – ప్రియాంక దారపు -
చే‘నేత’లో గొప్ప నైపుణ్యం
దరీలకు కేరాఫ్ కొత్తవాడ రేపు జాతీయ చేనేత దినోత్సవం పోచమ్మమైదాన్ : దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నది చేనేత వృత్తిపైనే. చేనేతల పనిలో గొప్ప నైపుణ్యం ఉం టుంది. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత వారి కే దక్కుతుంది. చేనేత దినోత్సవాన్ని ప్రకటించి, అధికారికంగా నిర్వహించాలని చేనేత కార్మికు లు పలుమార్లు ప్రధానమంత్రికి చేసిన వినతుల ను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఉత్తమ చేనేత కార్మికులకు జాతీయ అవార్డులను సైతం ఇస్తున్నారు. కొత్తవాడలో దరీల తయారీ వరంగల్ నగరంలోని కొత్తవాడలో అద్భుతమై న చేనేత దరీలు తయారవుతుంటాయి. దేశం న లుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల వా రు సైతం ఇక్కడి హ్యాండ్లూమ్స్పై అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రపంచంలోని పలుచోట్లకు ఎగుమతి అవుతుండటం విశేషం. కొత్తవాడలో సుమారు 1800 మంది చేనేత కార్మికులు రకరకాల హ్యాండ్ మేడ్ వస్తువులు తయారు చేస్తుంటారు. ఎర్రతివాచి పుట్టిం ది కూడా ఇక్కడే. ఢిల్లీలోని పార్లమెంట్లో వాడే తివాచీలు కొత్తవాడవే. హ్యాండ్లూమ్స్.. అనేక రకాలు కొత్తవాడలో అనేక రకాల హ్యాండ్లూమ్స్ తయారవుతున్నాయి. చేనేత మగ్గం, జనపనార, కాటన్ వినియోగించి డోర్ మ్యాట్స్, ఫ్లోర్ దగ్స్, జూట్ దరీస్, కార్పెట్లు, టెంట్‌హౌస్ సామగ్రి తదితర హోమ్‌నీడ్ దరీలు నేస్తున్నారు. వీటిని ఇంటర్‌లాక్, కలంకారి ప్రింటింగ్ కస్టమర్ కోరుకున్న రంగులో కోరుకున్న డిజైన్‌లో తయారు చేసి ఇస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి కొత్తవాడలో తయారు చేసిన చేనేత దరీలకు దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ డిమాండ్ ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, చెన్నై, బెంగుళూరు, ఇండోర్ ప్రాంతాలతోపాటు కెనడా, యూఎన్ఏ, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. పలు కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని దేశాల నుంచి నేరుగా కొత్తవాడ చేనేత కార్మికులకు ఆర్డర్లు వస్తున్నాయి. దరీల తయారీ విధానం కొత్తవాడ ప్రాంతంలో అనేక రకాల హ్యాండ్లూమ్(చేనేత) దరీలు తయారవుతున్నాయి. ఇందుకు తొలుత చేనేత కార్మికులు నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నుంచి సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఈ సామగ్రి అధికంగా కోయంబత్తూరు నుంచి దిగుమతి అవుతుంది. వీటిని ఒక పద్ధతిలో అమర్చిన వాటిని ప్రింటింగ్ వేసి విక్రయిస్తున్నారు. కలంకారి ప్రింటింగ్ కలంకారి ప్రింటింగ్ పద్ధతిలో రూపొందించిన దరీలను అధికంగా ఇళ్లలో వినియోగిస్తారు. తొలుత కొత్తవాడలో చేనేత దరీలు తయారు చేస్తారు. తర్వాత వాటిని మచిలీపట్నం పంపించి వివిధ డిజైన్లు ప్రింటింగ్ వేయిస్తారు. అక్కడ వేజిటేబుల్ డైయింగ్‌లో (సహజ సిద్ధమైన) దరీలను ప్రింట్ చేస్తారు. ఈ తరహాలో దరీలను అత్యంత డిమాండ్ ఉంటుంది. డోర్ కర్టన్లకు, టెంట్లకు, వాల్ బ్యానర్లకు తదితర కలంకారి ప్రింటింగ్లనే అధికశాతం ఇష్టపడుతుంటారు. జ కోట్ (జూట్ పద్ధతి) జకోట్ దరీలను జనపనారతో తయారు చేస్తారు. దరీలు తయారు చేసిన అనంతరం కాళ్లతో తొక్కుతూ డిజైన్‌ను రూపొందిస్తారు. ఇందులో కూడా నచ్చిన డిజైన్‌ను రుపొందిస్తారు. ఈ తరహా దరీలను అధికంగా ఫ్లోర్‌కు వినియోగిస్తారు. రాములుకు జాతీయ ఉత్తమ చేనేత అవార్డు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న వారాణాసిలో జాతీయ ఉత్తమ చేనేత కార్మికుడి అవార్డును కొత్తవాడకు చెందిన పిట్ట రాములు అందుకోనున్నారు. కొన్నేళ్లుగా చేనేత వృ త్తిలో కొనసాగుతూ ఎంతో అందమైన దరీలను తయారుచేస్తున్నారు. మెుఘల్ హంటింగ్ కళాఖండాన్ని దరీపై రూపొందించి ఔరా అనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత రంగంలో దరీ వి భాగంలో ఉత్తమ చేనేత కార్మికుడు అవార్డును అందుకోవ డం ఇదే తొలిసారి. రాములు తయారు చేసిన దరీలు ఇతర దేశాలకు సైతం పంపిస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఆర్డర్లు తీసుకొని ఎంతో అందమైన డిజైన్లు రూపొందిస్తున్నారు. దేశం లో జరిగే అన్ని చేనేత ఎగ్జిబిషన్లలో ఆయన తయారుచేసిన వాటిని అమ్మకాలకు పెడుతున్నారు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ దరీల తయారీలో ఇంటర్ లాకింగ్కు ప్రత్యేక స్థానం ఉంది. దరీల తయారు చేసి వాటిపై చేతితో పలు రకాల డిజైన్లు వేసే పద్ధతినే ఇంటర్ లాకింగ్ అంటారు. ఈ పద్ధతిలో దరీలపై ఫొటోలు, డిజైన్ వస్తాయి.