సాక్షి, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో యువతకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ స్కిల్ యూనివర్శిటీ అన్నారు. ఈ ఏడాదిలో ఈ నగరం రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment