CM Jagan Review Meeting on Future Technology Skills - Sakshi
Sakshi News home page

ఏపీ విద్యార్థులను వెస్టర్న్‌ వరల్డ్‌ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం: సీఎం జగన్‌

Published Thu, Jul 20 2023 2:26 PM | Last Updated on Fri, Jul 21 2023 8:19 AM

Cm Jagan Review Meeting On Future Technology Skills - Sakshi

వెస్టర్న్‌ వరల్డ్‌లో ఉన్న బోధనా స్థాయిలను అల­వర్చు­కుంటేనే ఏపీ విద్యార్థులు కూడా ఆ స్థాయికి చేరి పోటీ పడగలుగుతారు. దీనికోసం ప్రశ్నా విధానం మారాలి. పిల్లలకు బోధించే విధానంలో కూడా మార్పు రావాలి. కరిక్యులమ్‌లో కూడా మనం వాళ్ల­కంటే ఏ మేరకు మెరుగు పరుచుకోవాలన్న విష­యాన్ని పరి­శీలించాలి. ఇందుకు పాఠశాల స్థాయిలో కూడా బోధన, బోధనా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసు­కురావాలన్నది ఆలోచించాలి. స్టేట్‌ సిలబస్, నేష­నల్‌ సిలబస్, సీబీఎస్‌ఈ వంటి అంశాలకే పరి­మితం కాకుండా ఇంకా ముందుకు అడుగులు వేయాలి.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్‌ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధిని అందించాల్సి ఉందని, ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికకు రూప­కల్పన చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా బోధ­నలో, శిక్ష­ణలో ఫ్యూచర్‌ టెక్నాలజీ వినియోగంపై కార్యా­చరణ రూపొందించాలని ఆదేశించారు. ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో సమావేశం అయ్యారు. విద్యా శాఖ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డేటావివ్‌ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఐబీ (ఇంటర్‌నేషనల్‌ బాకలారియేట్‌)తో కలిసి ఒక కొత్త సిలబస్‌ను రూపొందించబోతున్నామని, అది దేశానికే బెంచ్‌ మార్క్‌ కాబోతుందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐబీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌తో కలిసి టీచింగ్‌ మెథడాలజీని, పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నామని.. దీనికి మీ లాంటి వారి సహకారం అవసరమని కోరారు. తద్వారా ఈ కల సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఉన్నత విద్యలో మెరుగైన సంస్కరణలు
మనం రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాం. ఒకటి పాఠశాల విద్య, రెండోది ఉన్నత విద్య. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటినీ అనుసంధానం చేయాలి. పాఠ్యప్రణాళిక కూడా సమ్మిళితం చేయాలి. ఇది ప్రధాన లక్ష్యం. 

ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరం. ఇండియాలో ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వంటి వర్టికల్స్‌ అభివృద్ధి చాలా తక్కువ. వాటిని బోధించే సిబ్బంది కొరత కూడా ఎక్కువ. వీటిని పాఠ్య ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఫైనాన్స్‌ సబ్జెక్ట్‌నే తీసుకుంటే.. బీకామ్‌లో ఫైనాన్స్‌కు సంబంధించిన ఇతర వర్టికల్స్‌ ఏవీ అందుబాటులో లేవు. అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి. రిస్క్‌ మేనేజ్‌మెంట్, అసెట్‌ మేనేజ్‌మెంట్, రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌ వంటి అంశాలను కరిక్యులమ్‌లో భాగం చేయాలి.

కంటెంట్‌ ఉన్నా, ఈ వర్టికల్స్‌ను బోధించే సిబ్బంది అందుబాటులో లేనందునే కరిక్యులమ్‌లో భాగంగా వీటిని తీసుకురాలేకపోతున్నాం. వెస్టర్న్‌ వరల్డ్‌లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉంది. ఇవన్నీ అక్కడ కరిక్యులమ్‌లో భాగంగా ఉన్నా­యి. అందువల్ల ఇక్కడ వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ వంటి అంశాలు కరిక్యులమ్‌లో చేర్చాలి. 

ఈ కరిక్యులమ్‌ కేవలం ఒక సంస్థకే పరిమితం కాకుండా.. పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో అందుబాటులోకి తీసుకురావాలి. ఒక తరంలో వీటిని మనం నేర్పించగలిగితే... ఆయా వర్టిక­ల్స్‌లో మనం నిపుణులను తయారు చేయగలు­గుతాం. ఈ అంశాలను మన కరిక్యులమ్‌లో భాగంగా చేర్చకపోతే.. మన పాఠ్య ప్రణాళిక బలపడదు. వెస్టర్న్‌ వరల్డ్‌తో పోటీ పడలేం. అందువల్ల ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. దీన్ని పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలన్న కసరత్తు జరగాలి. స్కూల్‌ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఎలా సమ్మిళితం చేయాలన్నది మూడో అంశం. 

తరగతి గదుల డిజిటలైజేషన్‌
రాష్ట్రంలో ఇప్పటికే 6వ తరగతి నుంచి తరగతి గదుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 63 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్‌ ఆఖరుకు ఇది పూర్తవుతుంది. ఇప్పటికే 32 వేల తరగతి గదుల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముగిసింది. 

3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ ను అమలు చేస్తున్నాం. బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ పంపిణీ చేస్తున్నాం. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ­పెట్టాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు కూడా ఇస్తున్నాం. ఈ మార్పులన్నీ ఏపీలోని స్కూళ్లలో చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పు­లను ఇప్పుడు ఉన్నత విద్యతో సమ్మిళితం చేస్తూ మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నదే మన ముందున్న సవాలు.

ఐబీ యుగంలో ఉన్నాం
ఇప్పుడు మనం ఐబీ (ఇంటర్‌నేషనల్‌ బాకలారి­యేట్‌) యుగంలో ఉన్నాం. మనం వాటిని అవలంబించలేకపోతే, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే.. వెస్టర్న్‌ కంట్రీస్‌లో పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. ఐబీలో వారి ప్రశ్నల స్థాయికి, మనకు మధ్య చాలా తేడా ఉంది. 

మనం 3వ తరగతి నుంచే టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్, ప్లస్‌1, ప్లస్‌ 2 లెవల్లో సీనియర్‌ పరీక్షలను కరిక్యులమ్‌లో భాగం చేయబోతున్నాం. ఈ మార్పులన్నీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందించగలిగితే అది గొప్ప మార్పు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే చేస్తున్నాం. 

స్కూల్‌ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఈ మార్పులు తీసుకుని వెళ్లి, సమ్మిళితం చేయడం ద్వారా ప్రధామైన పోటీదార్లుగా నిల­బెట్టి.. మా పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకు­పోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. అత్యు­త్తమ ఐటీ నిపుణులు, కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా ఆశయం. ఈ నేపథ్యంలో ఈ మార్పుల కోసం మీ అందరి సహకారం కోరుతున్నాను. 

విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత

ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన మార్పులను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ తరగతి వరకు స్మార్ట్‌ టీవీ ఏర్పాటు చేశాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిగదిలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశాం. 

పిల్లల గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యే వరకు భరోసా అందించాలన్నదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా తల్లులు తమ పిల్లలను స్కూల్‌కు పంపించేలా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలవుతోంది. రూ.20 వేల వరకు పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతోంది. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 
సమావేశంలో పాల్గొన్న వారు..

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, మైక్రోసాఫ్ట్‌ లెర్నింగ్‌ అండ్‌ స్కిల్స్‌ లీడ్‌ డాక్టర్‌ విన్నీ జౌహరి, ఇంటెల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ (ఆసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌) శ్వేత ఖురానా, నాస్కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సంధ్య చింతాల, ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా కో ఫౌండర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చారు మల్హోత్ర, ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌ పూజ క్వాత్రా, సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎకానమీ పాలసీ రీసెర్చ్‌ ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జైజిత్‌ భట్టాచార్య, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ హెడ్‌ ఆఫ్‌ స్కిల్స్‌ టు జాబ్స్‌ (ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా) డిపి సింగ్, గూగుల్‌ లీడ్‌ ఎడ్యుకేషన్‌ శ్రీనివాస్‌ గరిమెళ్ల, మైక్రోసాఫ్ట్‌ స్కిల్స్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ కిషోర్‌ గార్గ్, డేటావివ్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేదాంత్‌ అహ్లువాలియా, డేటావివ్‌ బోర్డు మెంబర్‌ అతుల్‌ కుమార్‌ పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, సమగ్రశిక్షా అభియాన్‌ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి ఎన్‌ దీవాన్‌ రెడ్డి, పలువురు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

వర్చువల్‌గా విదేశీ కోర్సులు 
ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌ను పాఠశాల స్థాయికే పరిమితం చేయకుండా ఉన్నత విద్యలో కూడా ప్రవేశపెట్టాలి. సాంకేతిక పరి­జ్ఞానంలో వస్తున్న మార్పులను చేర్చగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు గ్రాడ్యు­యేషన్‌ పూర్తయ్యే నాటికి మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. 

కొన్ని కోర్సుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే సబ్జెక్ట్‌లను వర్చువ­ల్‌గా బోధించడం ద్వారా మన దేశంలో అందు­బా­టులోకి తీసుకురావాలి. వర్చువల్‌ టీచింగ్, వర్చువల్‌ కంటెంట్‌ అందుబాటులోకి తేవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్‌లోని సంప్రదాయ విధానాల్లో కూడా మార్పులు రావాలి. వాటిని పునర్‌నిర్వచించాల్సిన అవసరం ఉంది. రోబోటిక్స్‌ ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉంది. వీటిమీద దృష్టి పెట్టాలి. ఈ మార్పులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే సమావేశం నాటికి స్కూల్‌ ఎడ్యుకేషన్‌తో పాటు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. 

సీఎంతో సమావేశమైన ప్రముఖులు.

డాక్టర్‌ విన్నీ జౌహరి
మైక్రోసాఫ్ట్‌ లెర్నింగ్‌ అండ్‌ స్కిల్స్‌ లీడ్‌ 

మైక్రోసాఫ్ట్‌లో డైరెక్టర్, ఎడ్యుకేషన్‌ అడ్వొకసీగా విన్నీ జౌహరి పని చేస్తున్నారు. దీనికి ముందు గుర్గావ్‌లోని ఐఐఎంటీలో డైరెక్టర్, స్ట్రాటజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. హెచ్‌పీ ల్యాబ్స్‌ ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ఆఫీస్‌కు రీజియన్‌ లీడ్‌గా సేవందించారు. హెచ్‌పీ ల్యాబ్స్‌లో  పనికి, విద్యా విషయాల్లో విజయాలకు  అవార్డులు అందుకున్నారు. జౌహరి జర్నల్‌ ఆఫ్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్, జర్నల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ గ్రోయింగ్‌ ఎకానమీస్‌కు వ్యవస్థాపక సంపాదకురాలుగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 

శ్వేత ఖురానా ఇంటెల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ 
(ఆసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌)  

ఆసియా పసిఫిక్, జపాన్‌ ప్రభుత్వాలతో వ్యూహాత్మక కార్యక్రమాలు నడిపించే బాధ్యత శ్వేత ఖురానా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యా­­ప్తంగా ప్రభుత్వాలు, డెవ­­­లప్‌మెంట్‌ ఏజెన్సీలు, వి­ద్యా­­­­సంస్థలు, కమ్యూనిటీలతో  సంబంధాలు కొనసాగించడంలో  23 ఏళ్ల అనుభవం ఉంది.  2010లో ఇంటెల్‌లో చేరారు. ఇండోనేసియాలో ఇంటెల్‌ కోసం కార్పొ­రేట్‌ అఫైర్స్, టెక్‌–ఎనేబుల్డ్‌ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడం, ఇండియాలో కే12 ఎడ్యుకేషన్‌ను నిర్వహించడం వంటి  అంశాల్లో నాయకత్వం వహించారు.   

చారు మల్హోత్ర ఎండీ, కో ఫౌండర్, ప్రైమస్‌ పార్టనర్స్‌ ఇండియా  
విద్యావేత్త, లెరి్నంగ్, డెవలప్‌మెంట్‌ ప్రొఫెషనల్, పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెర్నింగ్‌లో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం చారు మల్హోత్రకు ఉంది. విద్య, సాంకేతికత, సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో ప్రాజెక్టులపై 15 కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేశారు. భారతదేశంలోని ప్రభుత్వాల్లో ముఖ్యమైన ప్యానెళ్లు, కమిటీల్లో పనిచేశారు.   

శ్రీనివాస్‌ గరిమెళ్ల, గూగుల్‌ లీడ్‌ ఎడ్యుకేషన్‌   
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఎంటర్‌ప్రైజ్, ప్రభుత్వ, విద్యాపరమైన పాత్రలను కలిగి ఉన్న బహుముఖ విధుల్లో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం శ్రీనివాస్‌కు ఉంది. కార్పొరేట్, ప్రభుత్వ, విద్యాసంస్థల పనితీరులో సమర్థత, ప్రభావాన్ని తీసుకురావడానికి ఐసీటీ జోక్యాలపై దృష్టి సారించి అనేక ఇ–గవర్నెన్స్‌ ప్రాజెక్ట్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్‌లకు నాయకత్వం వహించారు. భారతదేశంలో మైక్రోసాఫ్ట్‌ కోసం స్మార్ట్‌ సిటీ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రాక్టీస్‌ను నిర్మించడానికి బాధ్యత వహిస్తున్నారు.   

జైజిత్‌ భట్టాచార్య 
సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎకానమీ పాలసీ రీసెర్చ్‌ ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ 

ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్‌ పార్క్‌ డైరెక్టర్ల బోర్డులో జైజిత్‌ భట్టాచార్య ఉన్నారు. డిజిటల్‌ విజన్‌ 2035 రూపొందిస్తున్నారు. షేకత్కర్‌ కమిటీ నివేదిక ఆధారంగా భారత వైమానిక దళ పునరి్నర్మాణం వంటి జాతీయ కార్యక్రమాలకు సహకరించారు. ఓపెన్‌ స్టాండర్డ్స్‌పై జాతీయ విధానానికి సహకరించారు. పెట్టుబడిదారుల దృక్కోణం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను సంకలనం చేసిన ‘ఇండియా సోర్స్‌ హై‘ నివేదిక ముఖ్య రచయిత ఆయన. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం లాంచ్‌లో భాగంగా ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. ఇ–గవర్నెన్స్‌ వ్యూహాలపై ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement