లింక్డ్‌ఇన్ ఇండియా ప్రొడక్ట్ హెడ్‌గా కుమరేష్ పట్టాభిరామన్ | LinkedIn India Appoints Kumaresh Pattabiraman As Product Head | Sakshi
Sakshi News home page

లింక్డ్‌ఇన్ ఇండియా ప్రొడక్ట్ హెడ్‌గా కుమరేష్ పట్టాభిరామన్

Published Sun, Aug 25 2024 5:18 PM | Last Updated on Sun, Aug 25 2024 5:33 PM

LinkedIn India Appoints Kumaresh Pattabiraman As Product Head

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'లింక్డ్‌ఇన్' ఆగస్టు 23న లాంగ్ టైమ్ ఎగ్జిక్యూటివ్ 'కుమరేష్ పట్టాభిరామన్'ను ఇండియా మేనేజర్‌ & ప్రొడక్ట్ హెడ్‌గా నియమించింది.

135 మిలియన్లకు పైగా సభ్యులతో లింక్డ్‌ఇన్ భారతదేశం రెండవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలిచింది. ఈ కంపెనీలో 11 సంవత్సరాలు పని చేసిన అశుతోష్ గుప్తా బయటకు వెళ్లిన తరువాత పట్టాభిరామన్ బాధ్యతలు స్వీకరించారు.

పట్టాభిరామన్ జూలై 2013లో లింక్డ్‌ఇన్‌లో కంపెనీ సెర్చ్ అండ్ డిస్కవరీ బృందానికి గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత కంపెనీ సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పట్టాభిరామన్ ఇప్పుడు ఇండియా మేనేజర్‌ & ప్రొడక్ట్ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement