లింక్డ్‌ఇన్ లైట్ వెర్షన్ యాప్
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ట్విటర్ తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’ కూడా లైట్ వెర్షన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది యూజర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ యాప్‌ను ఆవిష్కరించింది. డేటా వినియోగాన్ని 80 శాతం వరకు తగ్గించాలనే లక్ష్యంతో కొత్త ‘లింక్డ్ ఇన్ లైట్’ యాప్‌ను రూపొందించింది. దీని పరిమాణం 1ఎంబీ కన్నా తక్కువగానే ఉంది. ‘లింక్డ్‌ఇన్ లైట్ యాప్‌ను తొలిగా భారత్‌లో వినియోగంలోకి తెచ్చాం. దీన్ని త్వరలోనే 60కిపైగా దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తాం’ అని లింక్డ్‌ఇన్ తెలిపింది.