Lite Version App
-
పాస్ వర్డ్ పిన్ అవసరం లేకుండానే ఫోన్ పే పేమెంట్స్...
-
పబ్జీ లైట్ తరహాలో బీజీఎమ్ఐ లైట్ త్వరలోనే...!
పబ్జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 2న పబ్జీ స్థానంలో బీజీఎమ్ఐను క్రాఫ్టన్ తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను అత్యధిక సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. బీజీఎమ్ఐ లాంటి గేమ్స్ హై ఎండ్ ర్యామ్ ఉన్న ప్లాగ్ షిప్ ఫోన్లలో సులువుగా పనిచేస్తుంది. ర్యామ్ తక్కువగా ఉన్న బడ్జెట్ స్మార్ట్ఫోన్లలో బీజీఎమ్ఐ అంతగా సపోర్ట్ చేయదు. తరుచూ ఫోన్ హ్యగ్ అవుతోంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లను దృష్టిలో ఉంచుకొని పబ్జీ లైట్ తరహాలోనే బీజీఎమ్ఐ లైట్ గేమ్‌ను త్వరలోనే తీసుకురావాలని క్రాఫ్టన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజీఎమ్ఐ లైట్ వర్షన్‌తో అధిక సంఖ్యలో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేస్తోంది. కాగా లైట్ వెర్షన్ ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా తెలియలేదు. చదవండి: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్! -
వారి కోసం ‘ఇన్స్టాగ్రామ్ లైట్’
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ సొంతమైన సోషల్ మీడియా యాప్ 'ఇన్స్టాగ్రాం' ప్రపంచవ్యాప్తంగా మరింతమంది యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్ల కోసం కొత్త యాప్‌ను విడుదల చేసింది. పనిచేసేలా 'ఇన్స్టాగ్రాం లైట్' పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అంతేకాదు మెయిన్ యాప్ లో ఉన్న ప్రధాన ఫీచర్లనీ లైట్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ లాంటి స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ యాప్ సైజ్ కేవలం 573 కేబీ మాత్రమే. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉండే యూజర్లకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ లైట్ యాప్‌లో కూడా యూజర్లు ఫోటోలు, స్టోరీలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు, ఇతర స్నేహితులు, యూజర్లు షేర్చేసినస్టోరీలను,వీడియోలను వీక్షించవచ్చు. కాగా 2015లో ఫేస్బుక్ కూడా ఫేస్బుక్ లైట్, మెసేంజర్ లైట్ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఇటీవల యూ ట్యూబ్‌కు పోటీగా ఇన్స్టాగ్రామ్ ఐజీటీవీ పేరుతో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తద్వారా గంట నిడివి గల వీడియోను షేర్ చేసుకునే సౌలభ్యాన్ని యూజర్లకు కలిగించింది. -
కస్టమర్లే టార్గెట్ : ఉబెర్ కొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ ఇండియా సరికొత్త ప్రణాళికలతో దూసుకు వస్తోంది. భారత్‌లో ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులే లక్ష్యంగా వ్యూహ రచన చేసింది. డారా ఖోస్రోషహీ నాయకత్వంలో ఉబెర్ ఇండియా ఇక్కడి మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తోంది. నెట్వర్క్ లో కనెక్టివిటీ పరిస్థితుల్లోనూ, అలాగే తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లలో కూడా బాగా పని చేయడానికి వీలుగా ఉబెర్ యాప్‌లో 'లైట్' వెర్షన్‌ను లాంచ్ చేసింది. అంతేకాదు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ ఉబెర్‌లైట్ వెర్షన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. త్వరలోనే భారతీయ భాషలు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ , గుజరాతీ భాషల్లో విడుదల చేయనుంది. తద్వారా భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రధాన ప్రత్యర్థి ఓలాను ఢీకొట్టేందుకు సిద్దపడుతోంది. టైర్ -3 నగరాలలో దాని వినియోగదారుల సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి, ప్రజాదరణను పెంచుకోటానికి ఉబెర్ తన యాప్‌లో డేటా-లైట్ సంస్కరణను ప్రవేశపెట్టింది. స్థానిక కస్టమర్లకు ఆకట్టుకునేలా వారికి అందబాటుల్లో భాషల్లో యాప్‌ను లాంచ్ చేయనుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఉబెర్ లైట్ రానున్న నెలల్లో దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ఉబెర్ ప్రకటించింది. ఏడు భారతీయ భాషలలో దీన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లకు రైడ్-బుకింగ్ అనుభవాన్ని సాధ్యమైనంత మృదువుగా, సన్నిహితంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం యూజర్లతో మాట్లాడుతున్నామని ఉబెర్ రైడర్ ప్రొడక్షన్ హెడ్ పీటర్ డెంగ్ చెప్పారు. -
లింక్డ్ఇన్ లైట్ వెర్షన్ యాప్
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విటర్ తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’ కూడా లైట్ వెర్షన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది యూజర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ యాప్‌ను ఆవిష్కరించింది. డేటా వినియోగాన్ని 80 శాతం వరకు తగ్గించాలనే లక్ష్యంతో కొత్త ‘లింక్డ్ ఇన్ లైట్’ యాప్‌ను రూపొందించింది. దీని పరిమాణం 1ఎంబీ కన్నా తక్కువగానే ఉంది. ‘లింక్డ్ఇన్ లైట్ యాప్‌ను తొలిగా భారత్‌లో వినియోగంలోకి తెచ్చాం. దీన్ని త్వరలోనే 60కిపైగా దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తాం’ అని లింక్డ్ఇన్ తెలిపింది.