వారి కోసం ‘ఇన్‌స్టాగ్రామ్‌ లైట్‌’ | Instagram Lite launches globally to attract more users in emerging markets | Sakshi
Sakshi News home page

వారి కోసం ‘ఇన్‌స్టాగ్రామ్‌ లైట్‌’

Published Thu, Jun 28 2018 7:11 PM | Last Updated on Thu, Jun 28 2018 7:19 PM

Instagram Lite launches globally to attract more users in emerging markets  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ సొంతమైన సోష‌ల్ మీడియా యాప్ 'ఇన్‌స్టాగ్రాం' ప్రపంచవ్యాప్తంగా మరింతమంది యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంట్రీ లెవ‌ల్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌ యూజర్ల కోసం కొత్త యాప్‌ను విడుద‌ల చేసింది. పనిచేసేలా 'ఇన్‌స్టాగ్రాం లైట్' పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. అంతేకాదు మెయిన్‌ యాప్‌ లో ఉన్న ప్రధాన ఫీచర్లనీ లైట్‌ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్   లాంటి స్మార్ట్‌ఫోన్ల కోసం ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన ఈ యాప్ సైజ్ కేవ‌లం 573 కేబీ మాత్ర‌మే. అంటే ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ త‌క్కువ‌గా ఉండే యూజ‌ర్లకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ లైట్‌ యాప్‌లో కూడా యూజర్లు ఫోటోలు, స్టోరీలు, వీడియోలు షేర్‌ చేయడంతో పాటు, ఇతర స్నేహితులు, యూజర్లు షేర్‌చేసినస్టోరీలను,వీడియోలను వీక్షించవచ్చు. కాగా 2015లో ఫేస్‌బుక్‌ కూడా ఫేస్‌బుక్‌ లైట్‌, మెసేంజర్‌ లైట్‌ వెర్షన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇటీవల యూ ట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ ఐజీటీవీ పేరుతో కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. తద్వారా గంట నిడివి గల వీడియోను షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని యూజర్లకు కలిగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement