న్యూఢిల్లీ: కమ్యూనికేషన్‌లో ఇమోజీలు ఇప్పుడు నిత్యావసరం అయ్యాయి. కొత్త ఇమోజీలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజా వార్త ఏమిటంటే గూగుల్ యానిమేటెడ్ ఇమోజీలు త్వరలో ఆండ్రాయిడ్ డివైజ్, గెలాక్సీలలోకి రానున్నాయి. షేకింగ్ ఫేస్, జెల్లీఫిష్, అల్లం, దుప్పి, బాతు, గాడిద, పిల్లనగ్రోవి, హేయిర్ పిక్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, పింక్, ఎల్లో, గ్రే కలర్ హార్ట్...మొదలైన 31 ఇమోజీలు ఉన్నాయి. జీ–బోర్డ్ బేస్డ్ ఇమోజీ కిచెన్ ద్వారా ఇమోజీ కలర్స్‌ను తమకు ఇష్టం వచ్చిన రంగులో మార్చుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ ‘గిఫ్ట్స్’
కొన్నిసార్లు మన ఫెవరెట్ కంటెంట్ క్రియేటర్‌ను అభినందించడానికి ‘లైక్’లు మాత్రమే చాలవు అనిపిస్తుంది. ‘గిఫ్ట్’ ఇవ్వాలనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్లాట్‌ఫామ్స్ టిప్ లేదా డొనేట్ సిస్టంను ప్రవేశ పెట్టాయి. ఫోటో అండ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్‌ల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ ఫీచర్ పేరు గిఫ్ట్స్. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్ అభిమానుల నుంచి ‘గిఫ్ట్స్’ అందుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment