ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ 'లింక్డ్‌ఇన్' (LinkedIn) ఇటీవల స్టేట్ ఆఫ్ AI @ వర్క్ రిపోర్ట్ ప్రారంభించింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు గ్లోబల్ ఏఐ కన్వర్జేషన్ ఏకంగా 70 శాతం పెరిగినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఏఐ మీద ఆధారపడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం మంది, భారతదేశంలో 5.6 శాతం మంది ఈ రంగంలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటున్నారు. కంపెనీలు కూడా ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.
అధికా వేతనాలు
ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల డిమాండ్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రొఫెషనల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, మీడియా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అధికంగా ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ రంగాల్లో ఏఐ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అధికా వేతనాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాయి.
భారతదేశంలో ఏఐ వర్క్‌ఫోర్స్ లెర్నింగ్ వేగవంతమవుతుంది. ఏఐ సంబంధిత కోర్సులను చూసే సభ్యలు సంఖ్య ఈ త్రైమాసికంలో 80% పెరిగినట్లు లింక్డ్‌ఇన్ వెల్లడించింది. ప్రపంచంలోని చాలామంది నిపుణులు ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్, పర్సనల్ ఎఫెక్టివ్‌నెస్, పర్సనల్ డెవలప్‌మెంట్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు.
నిజానికి ఏఐ నెపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించే వారు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'కి చెందిన సాధారణ పనులు మాత్రమే కాకుండా.. సాఫ్ట్ స్కిల్స్ అవసరమయ్యే ఇతర రకాల అర్థవంతమైన సృజనాత్మక పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీ ప్రధాన్యతను పెంచడంలో సహాయపడతాయి.
కంపెనీల ప్రాధాన్యత
రాబోయే రోజుల్లో ఏఐకి సంబంధించిన హబ్రిడ్ ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి. హైబ్రిడ్ వర్క్ సెట్టింగ్‌ల పరిధిని పెంచడంలో భాగంగా ఏఐ ఉద్యోగాలు 2023 ఆగస్టులో నుంచి 2023 ఆగస్టు నాటికి 13.2 శాతం నుంచి 20.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ టెక్నాలజీలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!
లింక్డ్‌ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. 90 దశకంలో ఇంటర్నెట్ ద్వారా జరిగిన వృద్ధికి సమానమైన అభివృద్ధి ఏఐ ద్వారా జరగనుంది. 2024లోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుంది.. ఇందులోనే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఈ టెక్నాలజీలో అవగాహన కలిగిన వారు భవిష్యత్తులో నాయకులుగా ఉంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment