‘లింక్‌డ్‌ ఇన్‌ ప్రొఫైల్స్‌’లో మోదీ, ప్రియాంక | PM Modi, Priyanka feature in LinkedIn Power Profiles List of 2017 | Sakshi
Sakshi News home page

‘లింక్‌డ్‌ ఇన్‌ ప్రొఫైల్స్‌’లో మోదీ, ప్రియాంక

Published Thu, Aug 24 2017 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

‘లింక్‌డ్‌ ఇన్‌ ప్రొఫైల్స్‌’లో మోదీ, ప్రియాంక - Sakshi

‘లింక్‌డ్‌ ఇన్‌ ప్రొఫైల్స్‌’లో మోదీ, ప్రియాంక

ముంబై: ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్‌డ్‌ ఇన్‌ అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్‌ జాబితా లో ప్రధాని నరేంద్రమోదీ, నటి ప్రియాంక చోప్రాలు చోటు సం పాదించారు. 2017 సంవత్సరానికి గాను భారత్‌కు సంబంధించి అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్, ఎక్కువమంది చూసిన ప్రొఫైల్స్‌ జాబితాను లింక్‌డ్‌ ఇన్‌ సంస్థ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ వరుసగా మూడో సారి చోటు సంపాదించారు.

 లింక్‌డ్‌ ఇన్‌లో ఆయనను 22లక్షలు మంది అనుసరిస్తున్నారు. జాబితాలో మొత్తం 50మంది చోటు సంపాదించగా, వారిలో నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి , కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్, సిప్లా సీపీఓ ప్రబీర్‌ ఝా, షయోమీ టెక్నాలజీ వైస్‌ ప్రెసిడెంట్, ఎండీ మను కుమార్‌ జైన్‌ తదితరులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement