మోదీని కలిసిన బాలీవుడ్‌ నటి | Priyanka Chopra meets PM Narendra Modi in Berlin | Sakshi
Sakshi News home page

మోదీని కలిసిన బాలీవుడ్‌ నటి

Published Tue, May 30 2017 4:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మోదీని కలిసిన బాలీవుడ్‌ నటి - Sakshi

మోదీని కలిసిన బాలీవుడ్‌ నటి

బెర్లిన్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న మోదీని ఆమె బెర్లిన్‌లో ప్రత్యేకంగా కలిసింది. తన చిత్రం ప్రచారంలో భాగంగా ప్రస్తుతం బెర్లిన్‌లోనే ఉన్న చోప్రా ప్రధాని అక్కడి పర్యటనకు వెళ్లిన విషయం తెలుసుకొని ప్రత్యేక అపాయింట్‌మెంట్‌ ద్వారా కలిసి ముచ్చటించింది. ఒక సుదూర ప్రాంతంలో ఇలా అనూహ్యంగా ప్రధాని మోదీని కలవడం ఆమెకు మహదానందాన్నిచ్చింది. ఈ విషయాన్ని ప్రియాంకానే స్వయంగా ట్విట్టర్‌లో పంచుకుంది. ప్రియాంక ‘బే వాచ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో​ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఆమె బెర్లిన్‌లోనే ఉన్నారు.

‘ఈ రోజు ఉదయం కలిసేందుకు నాకు అవకాశం కల్పించి, నాకోసం సమయం వెచ్చించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. బెర్లిన్‌లో ఒకే సమయంలో ఇలాంటిది చోటుచేసుకోవడం గొప్ప యాధచ్ఛికం’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మోదీతో భేటీ అయిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మొత్తం ఆరు రోజులపాటు జరిగే ఈ పర్యటనలో మోదీ జర్మనీతోపాటు స్పెయిన్‌, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement