సాక్షి, ముంబై: కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ప్రపంచ దేశాలలో పేరు మోసిన చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇందులో గూగుల్ వంటి బడా సంస్థలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉన్న లింక్డ్‌ఇన్ కూడా చేరిపోయింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'లింక్డ్‌ఇన్' రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఇందులో ఎంత మంది ఉద్యోగులను తొలగించింది అనే దాని మీద ఎటువంటి స్పష్టమైన సమాచారం అందివ్వలేదు. నిజానికి 2023 ప్రారంభంలో టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించిన లింక్డ్‌ఇన్ (LinkedIn) ఇప్పుడు ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది.
2023 ప్రారంభంలోనే 10 వేల మందిని తొలగించినట్టుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల సంఖ్య, తొలగించడానికి గల కారణాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment