
ప్రభుత్వంతో ‘లింక్డ్ ఇన్’ ఎంఓయూ
ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ‘లింక్డ్ ఇన్’ తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. విద్యార్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో లింక్డ్ ఇన్..
ముంబై: ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ‘లింక్డ్ ఇన్’ తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. విద్యార్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో లింక్డ్ ఇన్.. మానవ వనరుల అభివృద్ధి శాఖతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానమైన అన్ని కాలేజీలు తమ ‘ప్లేస్‌మెంట్స్’ ప్రొడక్ట్‌ను ఆమోదించాల్సి ఉంటుందని లింక్డ్ ఇన్ పేర్కొంది. విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ ప్రొడక్ట్‌ద్వారా దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా లింక్డ్ ఇన్.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ ప్లేస్‌మెంట్ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని విద్యార్థులకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు అందుబాటులోకి తెచ్చింది.